ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.50
Verdict - భారత్ అనే నేను

no review available


Reviewed By : Vijay MOVIE JOCKEY
3.50
Verdict - అంతఃకరణ శుద్ధితో మనసులను గెలుచుకున్న 'భరత్'...

నటీనటులు : మహేష్ బాబు, కైరా అద్వానీ


దర్శకత్వం : కొరటాల శివ


నిర్మాత : డివివి.దానయ్య


సంగీతం : దేవి శ్రీ ప్రసాద్


సినిమాటోగ్రఫర్ : రవి.కె.చంద్రన్, తిరునవుక్కరసు


ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్


స్క్రీన్ ప్లే : కొరటాల శివ


 


సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కొరటాల శివ కలిసి చేసిన రెండో సినిమా 'భరత్ అనే నేను', ఈ సినిమాపై అటు మహేష్ అభిమానుల్లో ఇటు సిని అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు గత సినిమాలు ఏవి ఆశించినంత విజయాలను సాధించకపోవడంతో మహేష్ అభిమానులంతా 'భరత్ అనే నేను' పై తమ ఆశలను పెట్టుకున్నారు. ఈ వారం 'భరత్ అనే నేను' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.


 


కథ :


ఇంగ్లాండ్ లో ఉంటూ, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపనతో వేరే వేరే డిగ్రీలు చేసే కుర్రాడు భరత్ (మహేష్ బాబు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తన తండ్రి (శరత్ కుమార్) మరణంతో ఇండియా తిరిగొచ్చి పెద్దల మాటతో బలవంతం మీద ముఖ్యమంత్రి భాద్యతలు స్వీకరిస్తాడు.


అలా రాజకీయాలు గురించి, రాష్ట్ర పాలన గురించి, పార్టీలోని రాజకీయ నాయకుల గురించి ఏమాత్రం అవగాహన లేని భరత్ ఎలా పరిపాలన కొనసాగించాడు ? ప్రమాణస్వీకారంలో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అడుగడుగునా ఎలా తపించాడు ? రాష్ట్రాన్ని బాగుచేయడంలో ఎలాంటి కష్టాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కున్నాడు, ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అయ్యాడు ? అనేదే తెరపై నడిచే కథ.


 


విశ్లేషణ : 


మహేష్ బాబు అద్భుతమైన నటను కనబరిచారు, సినిమా మొత్తాన్ని ఆయనొక్కరే తన భుజాల పై వేసుకొని మోశారు. అతని ఎనర్జీ మరియు పవర్ఫుల్ గా కనపడడటం సినిమాకి ప్రత్యేక హైలైట్ అని చెప్పుకోవాలి. కొరటాల శివ రాసిన పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ కి మహేష్ తోడవడంతో థియేటర్లో డైలాగ్స్ బాగా పేలాయి. కొరటాల శివ తన అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా కొంత మెసేజ్ ను అందించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులకు సరిపోయే కొన్ని సీన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.


 


ఫస్టాఫ్లో మహేష్ నటన, అసెంబ్లీ సీన్, హీరోహీరోయిన్లు లవ్ ట్రాక్, ఇంటర్వెల్ సీన్ హైలెట్ గా నిలిచాయి, కానీ సెకండాఫ్ లో కొచ్చేసరికి కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించినప్పటికీ కొరటాల శివ మార్క్ మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. మహేష్ బాబు ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిపోయారు. ఎమోషన్ సీన్స్లో, ప్రేమ సన్నివేశాల్లో, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ లో, మాటతీరు లో చాలా అద్భుతంగా చేశాడు, ఇవన్నీ కూడా మహేష్ బాబు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. తను చేసిన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు.


 


కైరా అద్వానీ చాలా అందంగా ఉంది. మహేష్ బాబు,‌ కైరా మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలను చాలా చక్కగా రాసుకున్నాడు దర్శకుడు. కొరటాల శివ తను ఏదైతే చెప్పాలనుకున్నాడో సూటిగా చెప్పేశాడు, మూడు గంటలపాటు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాడు. గత సినిమాలో కంటే ఈ సినిమాలో తన స్క్రీన్ ప్లే, దర్శకత్వం పనితీరును అద్భుతంగా ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ బాగుంది, కొన్ని కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా భారత్ అనే నేను టైటిల్ సాంగ్ కి, వచ్చాడయ్యా పాటలకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. వారు పెట్టిన ఖర్చంతా సినిమాలో కనిపిస్తుంది. మిగిలిన అన్ని విభాగాల పనితీరు ఆకట్టుకుంది.


 


బలం బలహీనతలు 


 


ప్లస్ పాయింట్స్ :


* మహేష్ బాబు నటన


* ఫస్టాఫ్లో కొన్ని సీన్లు


* పోసాని మురళి కృష్ణ, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు పాత్రలకు తగ్గట్టు చాలా బాగా చేశారు.


* సెకండాఫ్లో మీడియాపై సెటైరికల్ సీన్స్


 


మైనస్ పాయింట్స్ : 


* సెకండాఫ్ లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తుంది.


* ఊహించే పతాక సన్నివేశం 


* హాస్యాన్ని కోరుకునేవారికి ఈ సినిమా నిరాశే మిగిలిస్తుంది.


 


 


మహేష్ బాబు అభిమానులు 'భరత్ అనే నేను' సినిమాపై పెట్టుకున్న అంచనాలను పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంది. మొత్తంగా 'భరత్ అనే నేను' సినిమా గురించి చెప్పు కోవాలి అంటే మహేష్ అద్భుతమైన నటనతో కొరటాల శివ మార్క్ టేకింగ్ తో, చక్కటి స్క్రీన్ప్లే తో సినిమాను తారా స్థాయికి చేర్చారు. దేవిశ్రీప్రసాద్ పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణ. ఫస్టాఫ్లో ఆసక్తిని కలిగించే సన్నివేశాలు, అసెంబ్లీ సిన్, ఇంటర్వెల్ సిన్  లో మహేష్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ మొదట్లో నెమ్మదిగా ఉన్నప్పటికీ తిరిగి మళ్లీ దుర్గ మహల్ ఫైట్, లవ్ ట్రాక్, ప్రెస్ మీట్ సీన్స్ తో సినిమా పుంజుకుంటుంది. పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది మరియు మిగతా సినీ ప్రేమికులకి మాములుగా అనిపిస్తుంది. ఈ సినిమాని కథ కోసం ఒకసారి చూడొచ్చు, మహేష్ బాబు కోసం ఎన్ని సార్లైనా చూడొచ్చు...!


Reviewed By: Anwar Anonymous
4.00
bharat ane nenu
block buster of yhe year

Reviewed By: Pawan Anonymous
2.50
One time watchable
Concept good but avg mve

 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Videos
Load moreవీడియోస్!!!
Latest News