wallpaper
celebrity

అ!
Views : 8865

3.50
|
|
Write a Review
విడుదల తేది : February 16, 2018, దర్శకుడు : , నిర్మాత : నాని, , తారాగణం :నాని, కాజల్ అగర్వాల్, రెజినా కాసాండ్రా, నిత్య మీనన్, శ్రీనివాస్ అవసరాల
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
3.50
Verdict - అద్భుతమైన ప్రయత్నం, కానీ ఇది ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ అని మర్చిపోతున్నారు.
నటీనటులు : కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజినా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ, దేవ దర్శిని


దర్శకత్వం : ప్రశాంత్ వర్మ


నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని


సంగీతం : మార్క్.కె. రాబిన్


సినిమాటోగ్రఫర్ : కార్తీక్ ఘట్టమనేని


ఎడిటర్ : గౌతమ్ నెరుసు


నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మొట్టమొదటిసారిగా 'అ!' అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకి షార్ట్ ఫిలింమేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా, నిత్యామీనన్, అవసరాల శ్రీనివాసరావు, ప్రియదర్శని, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నాని మరియు మాస్ మహారాజ రవితేజ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. మార్క్.కె. రాబిన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించాడు. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.


కథ : 


శివ (అవసరాల శ్రీనివాస్ రావు) రాధ (ఈషా రెబ్బా) కృష్ణ (నిత్యామీనన్) నీల (ప్రియదర్శని) మీరా (రెజీనా) మురళీ శర్మ వీరందరితో పాటుగా ఒక చిన్న పాప. వీరి పాత్రలే ఈ సినిమా. ఒక్కొక్క పాత్రకు ఒక్కో ఆలోచనా విధానం ఉంటుంది. ఒక్కో పాత్ర ఒక్కొక్క విధంగా నడుచుకుంటూ ఉంటారు. వీరందరూ ఓకే రెస్టారెంట్లో ఉంటారు కానీ ఒకరికి ఒకరు తెలీనట్టే ఉంటారు. ఈ కథలో కాలి(కాజల్ అగర్వాల్) ఉండదు కానీ కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది.


అసలు కాళీకి ఈ పాత్రల కి సంబంధం ఏమిటి...? అన్న విషయమే ఈ సినిమా. ఈ సినిమా కథ గురించి ఎంత తక్కువగా తెలుసుకుంటే అంత మంచిది. 


విశ్లేషణ:


ఈ సినిమాకి కథే హీరో, ఇప్పటివరకు ఇలాంటి సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాలేదు, ఈ సినిమా చూసి ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతారు అంటూ విడుదలకు ముందే సినిమా గురించి నాని ప్రచారం చేశారు, అయితే ఇందులో అక్షరం కూడా తప్పులేదు. నూటికి నూరుశాతం ఇది నిజం. ఇలాంటి సినిమాలు మనం తెలుగులో తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే సినిమా అంత కొత్తగా వైవిధ్యంగా ఉంటుంది. ఇలాంటి ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు ఎవరైనా. ఈ విషయంలో నాని ని మెచ్చుకోకుండా ఉండలేము. నాని ధైర్యం, కొత్త వారిని ప్రోత్సహించాలనే ఆలోచన నిజంగా ఇవి గొప్ప విషయాలు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఒక కొత్త అనుభూతినిచ్చారు. తెలుగులో కొత్త సినిమాలు రావు, రాలేవు అన్నవారికి ఈ సినిమాని ఒక సమాధానంగా చూపించొచ్చు. కథ ఏమిటో చెప్పకుండా సినిమా మొత్తాన్ని చూపించేస్తాడు దర్శకుడు, అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రేక్షకుడు నిరీక్షిస్తూ ఉంటాడు, కానీ అంతిమ ఘట్టం వరకు కథ తెలీదు. మొదటి భాగము ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి సన్నివేశానికి ప్రేక్షకుడు ఆశ్చర్య పడుతూ ఉంటాడు. మధ్యలో కొన్ని సన్నివేశాలు కథను పక్కదోవ పట్టించి నప్పటికీ, సినిమా కథతో ప్రేక్షకుడు వెళ్లి పోతూ ఉంటాడు. రెండో భాగం మొత్తాన్ని ఒక అర్ధం కాని విధంగా దర్శకుడు చాలా అందంగా తీసుకువెళ్ళాడు. ఒకానొక సందర్భంలో ఈ సినిమాకి కొత్తదనం మరింత ఎక్కువైపోయింది, ఇంత కొత్తదనం పనికిరాదు అని కూడా అనిపిస్తుంది కానీ కథ కంచికి చేరే సమయానికి సినిమా లో జరిగేదంతా ఒక్కసారిగా అర్థమైపోతుంది. అయినప్పటికీ ఇది అందరికీ నచ్చే సినిమాగా మాత్రం చెప్పలేము ఎందుకంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఇలాంటి సినిమాలు రాలేదు. తెలుగు ఫార్ములా సినిమా కాదు ఇది.


నిర్మాణ విలువలు చాలా చక్కగా ఉన్నాయి. ఎందులోని వెనక్కి తగ్గకుండా ఈ సినిమాని నిర్మించారు నిర్మాతలు. మార్క్.కె. రాబిన్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఉన్నది ఒక్క పాటే అయినప్పటికీ చక్కగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. గౌతమ్ నెరుసు ఎడిటింగ్ పై మరింత శ్రద్ధ పెడితే బాగుండేది అని అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అన్ని విభాగాలు చాలా చక్కగా పనిచేసాయి. ఇక పాత్రల విషయానికి వస్తే ఈ సినిమాలో మొదటగా చెప్పుకోవలసింది ఈషా రెబ్బ అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. నిత్యామీనన్ ఒక సరికొత్త పాత్రలో కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలు ఒప్పుకోవాలంటే నిజానికి చాలా ధైర్యం కావాలి. మురళీ శర్మ, అవసరాల శ్రీనివాస్ రావు సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. ఇప్పటివరకు మనం ఇతని లో హాస్యాన్ని మాత్రమే చూశాము ఈ సినిమా నుంచి ఒక సరికొత్త నటుడిని కూడా చూస్తాం. మిగిలిన అన్ని పాత్రలు వారి పాత్రలకు తగ్గట్టుగా బాగానే నటించారు.


బలం బలహీనతలు


ప్లస్ పాయింట్స్ : 


* మొత్తం ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించిన ఆ ఏడుగురి నటన.


* రెండో భాగం.


* అబ్బురపరిచే సన్నివేశాలు, కథ, కథనం.


* బ్యాగ్రౌండ్ స్కోర్.


* అన్ని విభాగాల పనితీరు.


మైనస్ పాయింట్స్ :


* కుటుంబ ప్రేక్షకులకు మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం చాలా నిరాశనే మిగిల్చింది.


* సెకండాఫ్లో కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలు.


* ఎక్కువగా కేరక్టర్లు ఉండటం వలన ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవుతాడు.


* మొదటి భాగంలో కొన్ని సీన్లు సాగదీసినట్టు అనిపిస్తుంది.


మొత్తానికి 'అ!' సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక చక్కటి ప్రయత్నం మా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు. మాస్ ఆడియన్స్, కుటుంబ ప్రేక్షకులు ఇలాంటి ఒక సినిమాని చూడటం చాలా కష్టం. ఒక కొత్త తరహా సినిమాని ప్రోత్సహించే వారికి తెలుగు సినిమా పైకి ఎదగాలి అని భావించేవారికి ఈ సినిమా ఒక చక్కటి అనుభూతినిస్తుంది. ఆపైన ఎవరి విజ్ఞానాన్ని బట్టి వారు ఈ సినిమాని అర్ధం చేసుకుంటారు, కొంతమందికి బాగా అర్థమవ్వొచ్చు, కొంతమందికి అస్సలు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి కొద్దిగా అర్థమవ్వొచ్చు ఇలా ఉంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ తప్పక "అ!"శ్చర్యపరుస్తుంది. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ ఐతే కాదు. ఈ సినిమాపై ఎంత తక్కువ అంచనాలు ఉంటే అంత బాగా ఈ సినిమాని ఆనందించగలం.

Be the first to comment on Awe Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
అవసరాల శ్రీనివాస్ ఫ్రొం నాటురల్ స్టార్ నాని డెబిట్ ప్రొడక్షన్ అ!
Videos
Load moreవీడియోస్!!!
Latest News