విడుదల తేది : January 26, 2018, దర్శకుడు : అశోక్ .జి , తారాగణం :అనుష్క శెట్టి
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
3.00
Verdict - భాగమతి రివ్యూ

నటీనటులు : అనుష్క, ఉన్ని ముకుందన్ 


దర్శకత్వం : జి. అశోక్


నిర్మాత : వంశీ, ప్రమోద్


సంగీతం : ఎస్.థమన్


సినిమాటోగ్రఫర్ : మధి 


ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు 


విడుదలకు ముందు నుంచి ఎంతో హైప్ తెచ్చుకున్న సినిమా భాగమతి, హర్రర్ థ్రిల్లర్ వంటి సన్నివేశాలతో కూడిన ట్రైలర్ లను విడుదల చేసి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా. చాలాకాలం తర్వాత అనుష్క మళ్లీ ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలో నటించిన చిత్రం. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఒక సారి చూద్దాం.


కథ: 


చంచల (అనుష్క) ఒక ఐ.ఎస్.ఎస్ ఆఫీసర్. ఆమె ఒక ప్రముఖ మంత్రి ఈశ్వర్ ప్రసాద్ (జైరామ్) వద్ద పర్సనల్ సెక్రెటరీగా భాద్యతలు నిర్వర్తిస్తూ ఒక హత్య కేసులో అరెస్టవుతుంది. అలా కస్టడీలో ఉన్న ఆమెను పోలీసులు రహస్య విచారణ కొరకు ఊరికి దూరంగా అడవిలో ఉన్న పాడుబడిన భాగమతి బంగ్లాకు తీసుకెళతారు. చంచల ఆ బంగ్లాలోకి ప్రవేశించగానే బంగ్లాలోని భాగమతి ఆత్మ ఆమెను ఆవహించి నాన భీభత్సం సృష్టిస్తుంది. ఆ భాగమతి ఎవరు..?, హత్య కేసులో అరెస్టు అయిన చంచలను పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లి అక్కడ నుంచి ఆ పాడుబడిన బంగళాలోకి ఎందుకు తీసుకు వెళ్తారు? అసలు చంచల హత్య కేసు నుంచి ఎలా బయట పడుతుంది..? అన్నది మనం తెరపైన చూడవలసిందే.... ఇది ఈ కథ ముఖ్య సారాంశం.


విశ్లేషణ : 


ఈ సినిమాకి దర్శకుడిగా (పిల్ల జమిందార్ ఫేం)జి. అశోక్ పనిచేసారు. దర్శకుడు గా అశోక్ కి మంచి మార్కులే పడ్డాయి. సినిమా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ట్విస్ట్ లతో సినిమాని ఆసక్తికరం గా మారుస్తాడు. కథ పాతదే అయినప్పటికీ చెప్పే విధానం కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. హీరోయిన్ అనుష్క నటన చాలా బాగుంది, భాగమతి పాత్రకు సరిగ్గా సరిపోయింది, ఇంటర్వెల్ సీన్ లో చాలా చక్కగా నటించింది‌. ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. తదితర నటీనటులు వారి పాత్రలకు తగ్గట్టుగా నటించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాని పిక్చరైజ్ చేసే విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. వారు పడిన కష్టం తెరపై కనిపించింది. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది.  మధి సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.


బలం, బలహీనతలు 


ప్లస్పాయింట్స్ :


* అనుష్క నటన


* ఫస్టాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు


* దర్శకత్వ ప్రతిభ


* ఇంటర్వెల్ సీన్ మరియు ఇంటర్వెల్ తర్వాత సీన్


మైనస్ పాయింట్స్ :


* చాలా సన్నివేశాలు సాగదీసినట్టు ఉంటాయి.


* క్లైమాక్స్


* హారర్ ఎఫెక్ట్ లేకపోవడం


* పాత కథ 


మొత్తానికి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు తీసే విధానం కోసం, అనుష్క కోసం ఈ సినిమాని చూడొచ్చు. సినిమాపై విపరీతమైన అంచనాలు పెట్టుకుంటే చివరికి నిరాశ పడతారు అందులో సందేహం లేదు. 


Be the first to comment on Bhaagamathie Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!
Latest News