విడుదల తేది : June 29, 2018, దర్శకుడు : , నిర్మాత : డి.సురేష్ బాబు, తారాగణం :అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
3.25
Verdict - సరదాగా కాసేపు..!

నటీనటులు : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి


దర్శకత్వం : తరుణ్ భాస్కర్


నిర్మాత : డి.సురేష్ బాబు


సంగీతం : వివేక్ సాగర్


సినిమాటోగ్రఫర్ : నికేత్ బొమ్మి


ఎడిటర్ : రవి తేజ గిరిజాల


స్క్రీన్ ప్లే : తరుణ్ భాస్కర్


 


పెళ్లి చూపులు సినిమా తో మంచి బ్రేక్ ని అందుకున్న తరుణ్ భాస్కర్ మరో సారి పెళ్లి చూపులు లాంటి ప్రయత్నం చేశాడు, ప్రస్తుతం ఆయన చేసిన సినిమా పేరు ‘ఈ నగరానికి ఏమైంది ?’ దానికి కింద ఛాలెంజ్ గా మీ గ్యాంగ్ తో థియేటర్ కి రండి చూస్కుందాం అని పెట్టారు. ఈ సినిమా ఈ వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.


 


కథ:


వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు నలుగురు మంచి స్నేహితులు. వీరిలో వివేక్ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని లవ్ బ్రేకప్ అవ్వడంతో అతను డిప్రషన్ లోకి వెళ్లి నలుగురి మధ్య కొంత దూరం పెరుగుతుంది.


 


అలాంటి సమయంలో ఆ నలుగురిలో ఒకరైన కార్తిక్ కు పెళ్లి కుదరడంతో అందరూ బార్లో కలిసి మందు తాగుతారు. ఆ మత్తులోనే గోవా వరకు వెళ్ళిపోతారు. అలా వెళ్లిన ఆ నలుగురి జర్నీ ఎలా సాగింది, అసలైన జీవితానికి వాళ్ళు తెలుసుకున్న అర్థం ఏమిటి అనేదే తెరపై నడిచే సినిమా.


 


విశ్లేషణ : 


తరుణ్ భాస్కర్ దర్శకుడు గా మరోసారి తనని తాను నిరూపించుకున్నాడు, సినిమా స్క్రీన్ ప్లే, దర్శకత్వం, స్టోరీ ఇలా అన్ని చాలా చక్కగా అనుకుని దానిని తెర మీదకు తీసుకొచ్చారు. ముందు నుంచి తరుణ్ అన్నట్టు, ఈ సినిమా మొత్తం కూడా ఒక 4 గురు  స్నేహితుల మధ్య సాగుతుంది. ఎక్కడ కొంచెం కూడా బోరింగ్ అనిపించకుండా తీసుకెళ్లారు, 2 గంటలు పాటు సినిమాను ప్రేక్షకుడు ఆహ్లాదకరంగా చూడచ్చు. ఈ సినిమా తరుణ్ తన నిజ జీవితం లో చూసినవి, అతనికి జరిగినవి ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఒక సినిమా హిట్ అవ్వగానే డైరెక్టర్ రూట్ మారిపోతుంది ఇంకా తప్పకుండా కమర్షియల్ సినిమాలు వైపు అడుగులు వేయాల్సిందే అని చాలా మంది చెప్తూ వుంటారు, కానీ తరుణ్ మాత్రం మరో సారి తనకి నచ్చిన సినిమా తీసుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


 


ఇకపోతే సినిమాలో ముఖ్యంగా చేప్పుకోవల్సిన పాత్రలు వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు విరు మళ్లీ మనకి చాలా సినిమాలో కనిపిస్తారు. వీరి నటన చాలా బాగుంది, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కౌశిక్ సెకండ్ హాఫ్ కామెడీ అయితే ఆడియెన్స్ నీ నవ్విస్తూనే ఉంటుంది. హీరోయిన్స్ ఇద్దరు పరవాలేదు అనిపించారు. సినిమా లో గౌతమ్ మీనన్, విజయ్ దేవరకొండ చిన్న గెస్ట్ రోల్ చేశారు. 


 


వివేక్ సాగర్ సంగీతం అలరించింది, కొన్ని పాటలు పరవాలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటర్ రవి తేజ గిరిజాల కూడా తన పని తాను చేసుకుంటూ వెళిపోయాడు. ఇక ఈ సినిమా తెర మీదకు రావడానికి కారణం అయిన వ్యక్తి డీ. సురేష్ బాబు, దర్శకుడి మీద పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి, సినిమా మొత్తాన్ని కూడా దర్శకుడికి నచ్చినటు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారు, ఇది నిజంగా చాలా గొప్ప విషయం, ఈ కాలం లో ఇలాంటి నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు.


 


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్: 


* దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రతిభ


* నటీనటుల నటన


* కామెడీ 


* స్క్రీన్ ప్లే


 


మైనస్ పాయింట్స్ :


* పెద్ద వారికి అంత నచ్చదు.


* కమ్షియల్ సినిమా లా ఉండదు.


 


 


దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు సహజమైన కామెడీతో రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవాలని చేసిన ప్రయత్నం ‘ఈ నగరినికి ఏమైంది’ చాలా వరకు ఆ దిశగా సక్సెస్ సాధించింది. దర్శకుడు తయారుచేసిన సింపుల్ స్టోరీ, ఊహాజనితమైన, ట్విస్టులు, ఎగైట్మెంట్స్ తో సరదా స్క్రీన్ ప్లేకి తోడు అభినవ్ పండించిన మంచి కామెడీ, ఇతర పాత్రల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను ఒక హాయిగా నవ్వుకోగలిగే మంచి కామెడీ ఎంటర్టైనర్ గా మలిచాయి. ఈ వారం సరదాగా కాసేపు నవ్వుకొడానికి ఈ చిత్రాన్ని ఒకసారి చూడచ్చు.


Be the first to comment on Ee Nagaraniki Emaindi Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!
Latest News