wallpaper
celebrity

గృహం
Views : 8932

3.00
|
|
Write a Review
విడుదల తేది : November 17, 2017, తారాగణం :సిద్ధార్థ సూర్యనారాయన్, ఆండ్రియా జెరెమియా
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
3.00
Verdict - గృహం మూవీ రివ్యూ

Director :  Milind Rau


Producer : Siddharth Narayan


Music Director : Girish Gopalakrishnan


Cast And Crew 


Siddharth        -    Krishna 


Andrea             -    Lakshmi


Atul Kulkarni   -    Paul 


Anisha Victor  -    Jenny


Suresh              -     Prasad 


 


ఈ మధ్యకాలంలో హర్రర్ మూవీస్ టాలీవుడ్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి, దానికి కారణం తెలుగు ప్రేక్షకులు వాటిని ఎక్కువగా ఆదరించడం వల్లే, అలా అని ప్రతి హారర్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోలేదు, ఒక సినిమా చూసిన తరవాత దాని ప్రభావం మన మీద ఉండగలిగితే అవి మంచి చిత్రాలుగా గుర్తింపు తెచ్చుకుంటాయి అలాంటి కోవకు చెందిందే ఈ సినిమా కూడా.


గృహం అని ఒక తెలుగు పేరు సినిమా కి పెట్టుకున్నప్పటికీ , సినిమా చూసినంతసేపు కూడా ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా చూసినట్టు వుంటుంది. ఒక రెండు సంవత్సరాల క్రితం తెలుగులో వచ్చిన ఇంగ్లీషు డబ్బింగ్ ఫిలిమ్ కన్జ్యూరింగ్ 2 అనే చిత్రాన్ని పొలినట్టు ఈ చిత్రం వుంటుంది.


కథలోకి వచ్చే సరికి ఒక జంటకు కొత్తగా పెళ్లై ఆనందం గా ఉంటున్న సమయంలో వాళ్ల ఇంటి పక్కనే కొత్తగా ఒక కుటుంబం వస్తుంది, ఆ కుటుంబం ఉండే ఇంట్లో కొన్ని ఆత్మలు ఉంటాయి, వాటి వల్ల ఆ కుటుంబానికి ఎదురయ్యే సమస్యలు, దాని వల్ల కొత్తగా పెళ్ళైన జంటకు ఎటువంటి సమస్యలు వస్తాయి వాటి నుంచి ఎలా బయటపడతారు అనేది ఈ చిత్రం కథ. సినిమా హర్రర్ మూవీ అయినప్పటికీ పతాక సన్నివేశాల దగ్గరికొచ్చేసరికి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా గా మారుతుంది.


ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిద్దార్థ్ గురించి. కృష్ణా పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు.  హీరోయిన్ ఆండ్రియా కూడా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఫస్టాఫ్ బాగుంది, కానీ సెకండాఫ్ లో కొంత డ్రాగ్ అయినట్టు కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అర్థం కాకుండా మారుతుంది, క్లైమాక్స్ బాగా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.


సినిమాలో ప్లస్,  డైరెక్షన్ డిపార్ట్ మెంట్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.  ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన అందరి నటనా చాలా బాగుందని చెప్పుకోవాలి. మైనస్ వచ్చేసరికి సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే తప్పడం, సినిమా తెలుగు నేటివిటికి దూరంగా ఉండటం


కుటుంబంతో చూడవలసిన సినిమా కాకపోయినా మంచి యూత్ ఫుల్ హర్రర్ మూవీ. చాలాకాలం తర్వాత సిద్ధార్థ్ కు బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు.


Be the first to comment on Gruham Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
గృహం స్టిల్స్
గృహం ప్రెస్ మీట్ ఫొటోస్
గృహం మూవీ పోస్టర్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News