wallpaper
celebrity

హలో
Views : 9560

3.30
|
|
Write a Review
విడుదల తేది : December 22, 2017, దర్శకుడు : విక్రం కుమార్, నిర్మాత : నాగార్జున అక్కినేని, తారాగణం :అఖిల్ అక్కినేని
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.25
Verdict - హలో
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
3.25
Verdict - హలో..! చిత్రం సమీక్ష.

నటీనటులు : అఖిల్‌ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్‌


దర్శకత్వం : విక్రమ్‌ కె. కుమార్‌


నిర్మాత : అక్కినేని నాగార్జున


సంగీతం : అనూప్ రూబెన్స్


సినిమాటోగ్రఫర్ : పి. ఎస్‌. వినోద్‌


ఎడిటర్ : ప్రవీణ్‌ పూడి


అఖిల్ అక్కినేని ఈ కుర్రాడు లో బలమైన శక్తి ఉందని తన మొదటి సినిమా 'అఖిల్' తోనే ప్రదర్శించాడు, కాకపోతే సినిమా కి సరైన కంటెంట్ లేదు. పోతే ఆ సినిమా ఫెయిల్యూర్ నుండి చాలా నేర్చుకున్నాను అని అఖిల్ చెప్పాడు, కింగ్ నాగార్జున 'హలో' సినిమాతో రీలాంఛ్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. 'హలో' ఈ వారం దియేటర్లకు వచ్చింది, మరి అఖిల్ రీలాంఛ్ లో ఎలాంటి విశేషాలున్నాయి ఒకసారి చూద్దాం.


ఈ సినిమా విషయానికొస్తే హలో టీజర్ విడుదలైనప్పుడే అర్థమైపోయింది ఈ సినిమా మనసంతా నువ్వే కి విక్రమ్ కుమార్ వెర్షన్ అని, ఇందులో పెద్ద మార్పేమీ లేదు లైన్ గా చూసుకుంటే అదే కదా, పోతే ఆ కథతో విక్రమ్ కుమార్ ఎలాంటి అనుభూతిని పంచారు అన్నదే ఈ సినిమా.


ఈ సినిమాలో డెస్టినీ అనే ఒక అంశంతో కథను అల్లారు, మనిషి జీవితాల్లో బంధాలను కనెక్ట్ చేసేది అదృశ్యంగా ఉండే వీధి అనే దారం, మన జీవితం లో మనకు సంబంధం లేని వ్యక్తులతో మనం చాలా దగ్గిర అయిపోతూ వుంటాం.. ఇది ఎందుకంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు అదే వీధి‌ అని చెప్పే ప్రయత్నం చేసింది ఈ సినిమా, ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఒక మంచి ప్రేమకథ తో చిత్రాన్ని తెరకెక్కించారు విక్రమ్ కుమార్.


కథ :


అనాథైన శీను (అఖిల్) తన చిన్నప్పటి స్నేహితురాలు జున్ను (కళ్యాణి ప్రియదర్శిన్) ను ఎంతో అభిమానిస్తాడు. జున్ను కూడా శీను అంటే ఎంతో అభిమానం చూపిస్తుంది. అలా వాళ్ళిద్దరి స్నేహం కొనసాగుతుండగా జున్ను ఢిల్లీ వెళ్లిపోతూ అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటుంది.


కానీ ఆ నెంబర్ ను పోగొట్టుకున్న శీను జున్ను ఎప్పటికైనా తిరిగొస్తుందని 13 ఏళ్ల నుండి ఎదురుచూస్తూనే ఉంటాడు. అలా ఎదురుచూపుల్లో ఉన్న శీనును జున్ను ఎలా కలిసింది ? ఆమెను చేరుకోవడానికి శీను ఎలాంటి సాహసాలు చేశాడు ? విధి వాళ్ళిద్దర్నీ ఎలా కలిపింది ? అనేదే ఈ సినిమా.


•ప్లస్ పాయింట్స్:


*అఖిల్ నటన హైలైట్ గా నిలిచింది


*జగపతి బాబు, రమ్య కృష్ణ పాత్రలు చాలా అందంగా ఉన్నాయి


*నిర్మాణ విలువలు, దర్శకుడి ప్రతిభ కళ్ళకు కట్టినట్టు కనిపించాయి.


*పి.ఎస్.వినోద్ కూడా తన సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించాడు.


*ఫస్టాఫ్, సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు క్లైమాక్స్.


మైనస్ పాయింట్స్:


*మనసంతా నువ్వే సినిమా కథ లాగే ఉండటం.


*సెకండాఫ్ లో సినిమా నెమ్మదిగా సాగడం


*మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా లేకపోవడం


*హీరో హీరోయిన్ల మధ్య కొంత ఎమోషనల్ డ్రామా ఉంటే ప్రేక్షకులు ఇంకాస్త సంతృప్తి చెందేవారు.


మొత్తం మీద మాస్ ప్రేక్షకుల మినహ ఈ ‘హలో’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగల చిత్రం.


Be the first to comment on Hello Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
హలో మూవీ ఆడియో లాంచ్ ఫొటోస్
హలో స్టిల్స్
హలో పోస్టర్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News