wallpaper
celebrity

జై సింహ
Views : 11485

2.90
|
|
Write a Review
విడుదల తేది : January 12, 2018, దర్శకుడు : కే. యస్ రవి కుమార్ , నిర్మాత : సి కళ్యాణ్, తారాగణం :నందమూరి బాలకృష్ణ, నయన తార, హరిప్రియ
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.00
Verdict - జై సింహ
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
2.75
Verdict - జై సింహా సినిమాపై పూర్తి సమీక్ష : అభిమానుల సింహం...

నటీనటులు : బాలక్రిష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి


దర్శకత్వం : కె.ఎస్. రవికుమార్


నిర్మాత : సి.కళ్యాణ్


సంగీతం : చిరంతన్ భట్


సినిమాటోగ్రఫర్ : రామ్ ప్రసాద్


ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోనీ


నట సింహం నందమూరి బాలక్రిష్ణ నటించిన 102వ చిత్రం ‘జై సింహ’ . ఈ చిత్రం శుక్రవారం భారీ అంచనాలు మధ్య విడుదలైంది. కె.ఎస్. రవికుమర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..


సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు.... సైలెంట్ గా ఉంది కదా అని కెలికితే తల కొరికేస్తేది.. బొమ్మ తిరగేస్తే... అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు అందర్నీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సింహం వేటకు సంబంధించిన విషయాలు ఇప్పుడు చూద్దాం.


కథ:


నరసింహం అయిదో తరగతి వరకే చదువుకున్న జీవితం గురించి ఎక్కువ తెలిసిన మనిషి, కొన్ని పరిస్థితుల వల్ల తనకి తెలిసిన వాళ్ళందరికీ దూరంగా అతని సొంత ఊరు వైజాగ్ నుంచి అతనికి పుట్టిన బిడ్డ తో సహా వెళ్ళిపోతాడు. చాలా ప్రాంతాలు తిరిగి చివరికి తమిళనాడులో కుంభకోణం అనే ప్రాంతానికి చేరుకుంటాడు, కానీ అతని గతం కుంభకోణం వరకు చేరుకుంటుంది. అసలు నరసింహ గతమేంటి అన్నదే మిగితా కథ...


విశ్లేషణ:


ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాలన్నీ ఈ సినిమా తరహా లాగే ఉంటాయి, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఆ సినిమా స్టోరీలే కానీ దీని ప్రత్యేకత దీనికుంది. కొత్తగా వుంది చాలా బాగుంది అని చెప్పలేం గానీ బాలకృష్ణ ఏం చేస్తే తన అభిమానులకు నచ్చుతుందో సరిగ్గా అదే దృష్టిలో పెట్టుకుని రెండున్నర గంటల సినిమాని తీశారు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కానీ తన మార్క్ ఈ సినిమాలో కనిపించలేదు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డారు అని తెలుస్తుంది, డాన్సుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, తన మార్క్ డైలాగ్స్, ఫైట్లతో ఎప్పటిలాగే బాలయ్య అదరగొట్టేసారు. హరిప్రియ, నటాషా దోషి వారి పాత్రలకు న్యాయం చేశారు. నయనతార నటన బాగుంది. బాలయ్య నయన తార మధ్య వచ్చే సన్నివేశాలను చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎస్.రవికుమార్.


సి.కళ్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి, తాను పెట్టిన ఖర్చు తెరపై కన్పించింది. ఈ సినిమాలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిరంతన్ భట్ సంగీతం. పాత కథకి కొత్త సంగీతం తోడైతే ఆ కథ సైతం కొత్తగా కనిపిస్తుంది అని నిరూపించాడు చిరంతన్ భట్. తన రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అని కూడా చాలా కొత్తగా అనిపించాయి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ సినిమాకి అదనపు ఆకర్షణ. ఎ.ఎం.రత్నం ఈ సినిమాకి కథ, డైలాగ్స్ ను అందించారు. కథలో అంత కొత్తదనం లేకపోయినా, డైలాగ్స్ విషయంలో పరవాలేదనిపించారు.


బలం బలహీనతలు


ప్లస్ పాయింట్స్:


* బాలకృష్ణ, నయనతార నటన


* చిరంతన్ భట్ సంగీతం


* ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని సన్నివేశాలు


* ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్సుల్లో బాలయ్య అదరగొట్టేసారు.


* ఫస్టాఫ్, క్లైమాక్స్, సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి.


* కుంభకోణం బ్యాక్ డ్రాప్లో వచ్చే బ్రహ్మాణుల గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరించే సన్నివేశం చాలా బాగుంది.


మైనస్ పాయింట్స్:


* పాత కథ


* దర్శకుడు ప్రతిభ కనిపించకపోవడం


* సినిమా లో కొన్ని సన్నివేశాలు బాలయ్య పాత సినిమాలో చూసినట్టు ఉంటుంది.


* స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి


* ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కథపై అంత ప్రభావం చూపలేదు.


తుది తీర్పు:


మొత్తంగా జై సింహ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక పాత తరహా మాస్ ఎంటర్టైనర్. ఈ సినిమా ఫ్యాన్స్ ని, మాస్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతి సెలవులు కావడంతో ఈ సినిమాకి ఇది మరింత కలిసొస్తుంది. ఈ సంక్రాంతికి మాస్ ఆడియన్స్ ని జై సింహా మెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు.


Be the first to comment on Jai Simha Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
జై సింహ పోస్టర్స్
జై సింహ స్టిల్స్
జై సింహా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News