wallpaper
celebrity

మళ్లీ రావా
Views : 3635

3.30
|
|
Write a Review
విడుదల తేది : December 08, 2017, దర్శకుడు : గౌతమ్ తిన్ననూరి , నిర్మాత : రాహుల్ యాదవ్ , తారాగణం :సుమంత్, ఆకాంక్ష సింగ్
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.25
Verdict - మళ్ళి రావా
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
3.00
Verdict - మళ్ళీ రావా చిత్రం సుమంత్ కి మరో గోదావరి .....
'నరుడా డోనరుడా' తర్వాత హీరో సుమంత్ చేసిన తాజా చిత్రం ‘మళ్ళీ రావా’. నూతన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…


సినిమా విషయానికి వస్తే మూడు కోణాల్లో కథ నడుస్తుంది, చిన్నప్పుడు ప్రేమ పుట్టడం ఆ తర్వాత విడిపోవడం, మళ్లీ యుక్త వయసులో కలుసుకోవడం ఆ తర్వాత మళ్లీ విడిపోవడం, చివరకు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే దానిపై కథ చివరి వరకు నడిస్తుంది. మంచి కథ కథనాలు తో  దర్శకుడు ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించి విజయం సాధించాడు.


కథ:

కార్తీక్‌(సుమంత్‌), అంజలి(ఆకాంక్ష) తోమిదోవ తరగతి చదువుకునే రోజుల్లోనే ఇద్దరకి ఒకరంటే ఒకరికి ఇష్టం.  అది నిధానంగా ప్రేమలోకి మారుతుంది, ఆ తర్వాత అనుకోకుండా ఇద్దరు విడిపోతారు. అలా విడిపోయిన ఇద్దరు మళ్లీ కలుసుకోవడానికి 13 ఏళ్ల పడుతుంది, అలా కలిసిన ఆ ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకటవ్వాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరు కలిసి రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్తారు, మరికొద్ది క్షణాల్లో ఒకటికాబోతున్నాం అనే టైంలో అంజలి వచ్చి తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి అమెరికాకు వెళ్ళిపొతుంది …ఆ తర్వాత ఏం జరుగుతుంది..? అసలు ఎందుకు అంజలి పెళ్లి ఇష్టం లేదని చెపుతుంది..? చివరకు వీరిద్దరూ కలుసుకున్నారా.. లేదా..? అనేది మిగిలిన సినిమా.....


ప్లస్ పాయింట్స్ గా కథ, క‌థ‌నం అని చేపుకోవచ్చు ఇంకా సుమంత్‌, ఆకాంక్ష నటన చాలా బాగుంది, ఇతర నటీనటలందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. కామెడీ టైమింగ్ కూడా పండింది.

మైనస్ పాయింట్స్ గా కమర్షియల్ ఎలెమెంట్స్ ఏమి లేకపోవడం మధ్యలో కొన్ని చోట్ల సినిమా స్లో గా వుండటం అని చెప్పుకోవచ్చు.


'మళ్ళీ రావా' చిత్రం తో సుమంత్ మళ్లీ కమ్ బ్యాక్ అయ్యాడు అని చెప్పచ్చు, యువతకు, ప్రేమ కథలను ఇష్టపడే వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది.


Be the first to comment on Malli Raava Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
మళ్ళీ రావా సక్సెస్ మీట్ ఫొటోస్
మళ్ళీ రావా పోస్టర్స్
మల్లి రావా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్
Load moreవీడియోస్!!!
Latest News