విడుదల తేది : February 16, 2018, దర్శకుడు : మంజుల ఘట్టమనేని, నిర్మాత : సంజయ్ స్వరూప్, టేక్నిషియన్ : రధన్, తారాగణం :సందీప్ కిషన్
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
2.50
Verdict - మనసుకు చాలా భారంగా ఉంటుంది.

నటీనటులు : సందీప్ కిషన్, అమైర దస్తూర్, త్రిదా చౌదరి, అదిత్


దర్శకత్వం : మంజుల


నిర్మాత : జెమిని కిరణ్, సంజెయ్ స్వరూప్


సంగీతం : రాధన్


సినిమాటోగ్రఫర్ : రవి యాదవ్


ఎడిటర్ : సతీష్ సూర్య


ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఇప్పటి సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క మంజులా ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రం 'మనసుకు నచ్చింది'. సందీప్ కిషన్ హీరోగా అమైర దస్తూర్, త్రిదా చౌదరి హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు.జెమిని కిరణ్, సంజెయ్ స్వరూప్ ఈ సినిమాకి నిర్మాత బాధ్యతలను తీసుకున్నారు. రాధన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ వారం 'మనసుకు నచ్చింది' సినిమా ధియేటర్ లోకి వచ్చింది ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.


కథ : 


సూరజ్ (సందీప్ కిషన్ ) నిత్య (ఆమెరా దస్తూర్) చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఒకరోజు వీరిద్దరికి పెళ్ళి చెయ్యాలని నిర్ణయిస్తారు కుటుంబ సభ్యులు. ఆ పెళ్ళి ఇష్టం లేని వీరిద్దరు గోవా పారిపోతారు. అక్కడ వీరిద్దరికి (త్రిదా చౌదరి) లిఖిత పరిచయమవుతుంది. కొంత కాలానికి లిఖిత, సూరజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. నిత్య, సూరజ్ ను ఇష్టపడుతుంది. సూరజ్ ఎవరిని ప్రేమిస్తున్నాడు..? లిఖిత ప్రేమ ఫలిస్తుందా లేక నిత్యా ప్రేమ ఫలిస్తుందా...? అనేది మిగిలిన కథ.


విశ్లేషణ : 


మంజుల ఘట్టమనేని గారు, ఈ సినిమాని చాలా ఇష్టపడి చేశారని అర్థమౌతుంది. ఆ ఇష్టం మాత్రమే సినిమాలో కనిపించింది అంతకుమించి ఆవిడ పనితనం ఏమీ బాగాలేదు. మంజుల ఘట్టమనేని గారు ఇప్పటికే రెండు సినిమాలలో నటించారు, రెండు సినిమాలకి నిర్మాత బాధ్యతలను కూడా తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఈ సినిమాతో దర్శకురాలిగా కూడా పరిచయం అయ్యారు అయితే ఒక సినిమాని తీయాలంటే ఇష్టం మాత్రమే ఉంటే సరిపోదు అంతకుమించిన కృషి పట్టుదల ఉండాలి, ఇవేమీ సినిమాల్లో కనిపించలేదు. దర్శకురాలిగా మొత్తంగా ఫెయిల్ అయ్యారు అని చెప్పలేము కానీ సినిమాతో ప్రేక్షకులను ఎంత నిరాశ పరచాలో అంతా నిరాశ పరిచారు. ఈ సినిమా చూసినంతసేపు నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. కొత్తగా తీశారు అని అనుకోవడానికి ఏమీ లేదు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన నేచర్ పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కానీ నేచర్ ని మహేశ్ బాబు వాయిస్ కోసం మాత్రమే వాడుకొన్నారు. బాగుంది అని అనుకోవడానికి ఈ సినిమాల్లో ఒక్క సీన్ కూడా లేదు. 


ఇకపోతే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీర్ గా పనిచేసిన రవి యాదవ్ కి కొన్ని మంచి మార్కులు పడతాయి. సందీప్ కిషన్ పాత్రకి సినిమాలో అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ కొద్ది సేపట్లో కూడా సందీప్ కిషన్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్లు ఇద్దరూ వారి వారి పాత్రలకు తగ్గట్టుగా బాగానే నటించారు. సతీష్ సూర్య ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా సినిమా కి బాగానే ఖర్చు పెట్టినట్టు అర్థమవుతుంది. రాధన్ సంగీతం పర్వాలేదు.


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ : 


* సందీప్ కిషన్ నటన


* సినిమాటోగ్రఫీ


* సంగీతం


మైనస్ పాయింట్స్ : 


* ఈ సినిమాలో నేచర్ ని ఎందుకు పెట్టారో తర్వాత ఎందుకు పక్కన పెట్టారో ఏమీ అర్థం కాదు.


* కథ ను నడిపించే విధానం.


* సినిమాల్లో ఏ పాత్రలకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు.


మొత్తంగా చెప్పుకోవాలంటే, మనసుకు నచ్చింది సినిమా మనసుకి చాలా భారంగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం చూడాలంటే చాలా సహనమే కావాలి. ఒక మహేష్ బాబు అభిమానులకు మాత్రం ఈ సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూసింత ఉపసమనం కలిగిస్తుంది. మహేష్ బాబుని విపరీతంగా ప్రేమించే అభిమానులకి ఆయన సోదరిని సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాని చూడొచ్చు, ఈ సినిమా ని సపోర్ట్ చెయ్యచ్చు అంతే అంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.


Be the first to comment on Manasuku nachindhi Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Videos
Load moreవీడియోస్!!!
Latest News