wallpaper
celebrity

మెంటల్ మదిలో
Views : 9273

3.50
|
|
Write a Review
విడుదల తేది : November 24, 2017, దర్శకుడు : వివేక్ అథేర్య , నిర్మాత : రాజ్ కందుకూరి, తారాగణం :శ్రీ విష్ణు , నీవిత్ పెత్తురాజ్
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
2.75
Verdict - మెంటల్ మదిలో రివ్యూ....
ఈ మధ్య వస్తున్న కొన్ని చిత్రాల కధల్లో కామన్ గా నడుస్తున్న స్క్రీన్ ప్లే ఏంటంటే ఫస్టాఫ్ లో ఒక మంచి ఫిల్ తో మూవీ స్టార్ట్ అవుతుంది, కథలో అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో చిన్న ట్విస్ట్ వస్తుంది దీన్ని బేస్ చేసుకుని సెకండాఫ్ ప్రథమార్థం ఉంటుంది, చివరిలో ఒక ఎమోషనల్ క్లైమాక్స్, దీంతో కథకు శుభం కార్డు పడుతుంది. సరిగ్గా 'మెంటల్ మదిలో' కూడా ఈ ఫార్ములాకు చెందిన చిత్రమే అని చెప్పుకోవాలి.

సినిమా కథలో కొచ్చేసరికి అందరి మనుషుల్లో ఉండే ఒక చిన్న లోపం, రెండు బెస్ట్ ఆప్షన్స్ ఇచ్చి దానిలో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే అందరికీ వచ్చేదే కన్ఫ్యూజన్ ఈ చిత్రంలో హీరో కి ఈ కన్ఫ్యూజన్ కాస్త ఎక్కువగా ఉంటుంది, ఈ లైన్ విన్న ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తుకు వచ్చే సినిమాలు 'భలే భలే మగాడివోయ్' మహాను భావుడు సినిమాలు. ఆ చిత్రాల్లో హీరోల కి చిన్న లోపం ఉంటుంది, అదే మాదిరిగా ఈ చిత్రంలో హీరోకి కన్ఫ్యూజన్ ఉంటుంది. తనకున్న ప్రాబ్లెమ్ ని సినిమా ఆఖరు వరకూ ఎమోషనల్ లో తీసుకెళ్తూ, క్లైమాక్స్ లో కూడా ఎమోషనల్ డ్రామా తోనే సినిమాని ముగిస్తాడు  దర్శకుడు.

సినిమాలో హీరో పేరు అరవింద్ కృష్ణ, హీరోయిన్ పేరు స్వేచ్ఛ, ఇంకో హీరోయిన్ పేరు రెనూ, అసలు కథ కొచ్చేసరికి అరవింద్ కి ఆప్షన్స్ ఇస్తే వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఇలాంటి ఒక అబ్బాయి(శ్రీ విష్ణు) జీవితంలోకి స్వేచ్ఛ అనే అమ్మాయి(నివేత) వస్తుంది, వీరిద్దరికి పెద్దలు పెళ్లి నిర్ణయిస్తారు, పెళ్లికి ముందు వీరిద్దరూ ఒకరి నొకరు బాగా అర్ధం చేసుకుంటారు, సరిగ్గా నిశ్చితార్థం రోజు ఒక సంఘటన వల్ల నిచ్చితార్థం ఆగిపోతుంది, తర్వాత హీరోకి ఆఫీస్ పని వలన ముంబై వెళ్లవలసి వస్తుంది వెళ్లే దారిలో రెనూ(అమృత) అనే అమ్మాయితో పరిచయం అవుతుంది, అరవింద్ రెనూ అందానికీ ఆకర్షితుడవుతాడు, ఒకవైపు కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరోవైపు ఇష్టపడని అమ్మాయి ఈ రెండూ ఆప్షన్స్ లో హీరో కన్ఫ్యూజన్ లో పడిపోతాడు వీరిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? తన కన్ఫ్యూషన్ అనే ప్రాబ్లమ్ కి కంక్లూజన్ ఏమిటి? అనేది మిగిలిన కథ.

సినిమాలో ప్లస్ పాయింట్స్ హీరో నటన పరంగా చాలా బాగా చేశాడు తన కన్ఫ్యూజన్తో థియేటర్లో నువ్వులు పండించాడు అయితే అదే కన్ఫ్యూజన్తో ఎమోషన్ కూడా పండించాడు.

ఇద్దరు హీరోయిన్ లు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు, ముఖ్యంగా చెప్పుకోవలసిన పాత్ర, హీరో తండ్రి (శివాజీ రాజా)  చాలా అద్భుతంగా చేశాడు, చివర్లో తను చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

సినిమాల్లో మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండాఫ్ స్లో గా వుండడం, ఫస్టాఫ్ లో వచ్చే ట్విస్టు కి సెకండాఫ్లో లింక్ చేసుకుంటూ వచ్చినప్పటికీ అంతా మనకి ముందుగానే అర్థమై పోతూ ఉంటుంది, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అంత బాగా ప్రజెంట్ చేయలేకపోయాడు అనే చెప్పుకోవాలి, ఆర్టిస్టులు ఉన్నా సెకండాఫ్లో అంతగా కామెడీ పండలేదు. చివరికి క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది.  సినిమాలో చివరగా 'నారా రోహిత్' తో చిన్న సీన్ ఉంటుంది అదికూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

మొత్తానికి ఈ వారంలో వచ్చిన అన్ని సినిమాల్లో కన్నా కొద్దిగా పరవాలేదనిపించింది, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా సినిమా జనాల్లోకి ఏమేరకు వెళుతుందో చూడాలి.

    


Be the first to comment on Mental Madhilo Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
మెంటల్ మదిలో సక్సెస్ సెలెబ్రేషన్స్
సంధ్య థియేటర్ వద్ద మెంటల్ మదిలో టీం ఫొటోస్
మెంటల్ మదిలో పోస్టర్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News