విడుదల తేది : November 24, 2017, తారాగణం :emp
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.00
Verdict - నెపోలియన్
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
2.25
Verdict - నెపోలియన్ రివ్యూ
'ప్రతినిధి' సినిమాతో మంచి రచయిత గా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ రవి, తన 'నెపోలియన్' సినిమాకు అన్ని  బాధ్యతలను తన పైనే వెసుకున్నాడు, ప్రతినిధి సినిమా రచయిత కాబట్టి ప్రేక్షకులు 'ప్రతినిధి' కథకు మించి ఊహించుకుని సినిమాకి వస్తారు, దానికి అనుగుణంగానే 'నెపోలియన్' చిత్రం కూడా 'ప్రతినిధి' సినిమాకి పార్ట్ 2 లా ఉంటుంది.


అసలు కథలోకి వస్తే ప్రథమార్థం మొత్తం కూడా సింగిల్ లైన్ మీద నడుస్తుంది, నీడ పోయిందంటూ హీరో(ఆనంద్ రవి) పోలీస్ స్టేషన్లో కంప్లెంట్ ఇస్తాడు, అయితే దీని పై పోలీసులు గట్టిగానే స్పందిస్తారు, తన పేరు నెపోలియన్ అని చెబుతాడు ఆరాతీస్తే తన పేరు అశోక్ గా తెలుస్తుంది. తనకు భార్య కూడా ఉంటుంది, అయితే ఇవేమీ తనకు గుర్తు లేదంటూ చెప్తాడు నెపోలియన్.  ఇది  ఇలా ఉండగా దేవుడు కలలో కి వచ్చి చెప్పాడు అంటూ యాక్సిడెంట్ కేసు గా క్లోజ్ అయిపోయిన కేసును ఆక్సిడెంట్ కాదు హత్య అని చెబుతాడు పోలీసులు కేసును రీ ఓపెన్ చేస్తారు, అసలు ఈ హత్యకు గురైన వ్యక్తి ఎవరు,ఈ హత్య కి నెపోలియన్ కి ఏమిటి సంబంధం అనేది మిగతా కధ.


ఫస్టాఫ్లో సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కానీ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చే సరికి ప్రేక్షకుల్ని నిరాశపరిచిందనే చెప్పాలి  సెకండాఫ్ లో చాలా సీన్లు అర్థం కాకుండా మొదలవుతాయి.  ఫస్టాఫ్ లో ఉన్నంత క్యూరియాసిటీ సెకండాఫ్ లోకి వచ్చేసరికి ఉండదు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా ఫస్టాఫ్ ను చెప్పుకోవచ్చు, మైనస్ పాయింట్స్ గా సెకండాఫ్ ని చెప్పుకోవచ్చు క్లైమాక్స్ కూడా ఊహించిన విధంగానే ఉంటుంది.


కానీ ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తీసిన హీరో మరియు దర్శకత్వం చేసిన ఆనంద్ రవి ని మాత్రం మెచ్చుకోవాలి, కథల్లో కొత్తదనం కోరుకునే వారికి 'నెపోలియన్' ఒక మాదిరిగా నచ్చుతుంది   

Be the first to comment on Napoleon Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!