విడుదల తేది : February 23, 2018, నిర్మాత : , టేక్నిషియన్ : శంకర్, తారాగణం :శ్రీకాంత్, , ఆలీ, పోసాని కృష్ణ మురళి, నల్ల వేణు, రఘు బాబు, జీవ, , చమ్మక్ చంద్ర
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
1.25
Verdict - ఆనందోబ్రహ్మ ఈసారి శ్రీకాంత్ హీరోగా...

నటీనటులు : శ్రీకాంత్, నజియా, సీత నారాయణ.


నిర్మాత : ఎం. విజయ్.


సంగీతం : రాప్ రాక్ షకీల్.


సినిమాటోగ్రఫర్ : పూర్ణ.


ఎడిటర్ : శంకర్.


100 సినిమాలకు పైగా తీస్తున్న శ్రీకాంత్ కు సినిమాలు అయితే వరుసగా వస్తున్నాయి కానీ సరైన హిట్టు మాత్రం రావట్లేదు. ఆయన చేసిన తాజా చిత్రం 'రా...రా..' ఈ సినిమాకి దర్శకుడు లేడు చాలా మంది టెక్నికల్ అసిస్టెన్స్ తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా ఈ వారం దియేటర్ లోకి వచ్చింది.  ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.


కథ : 


మూడు ప్లాప్ సినిమాలు తీసిన డైరెక్టర్ రాజ్ కిరణ్ (శ్రీకాంత్), ఏకంగా ఒక సినిమా దెబ్బ కైతే సొంత నాన్నే టపా కట్టేస్తాడు. హీరో అమ్మ అనారోగ్యం పాలవుతుంది, అమ్మని బతికించుకోవాలనే సెంటిమెంట్. ఒక హిట్ సినిమా ని తీయడం కోసం బంగ్లా కి బయలు దేరతాడు. కానీ అక్కడ ఉన్న దెయ్యాలు వాళ్ళను చాలా ఇబ్బందులకు గురిచేస్తూ బంగ్లా నుండి బయటకు వెళ్లకుండా చేస్తాయి. ఆ  తరువాత దెయ్యాలతో సావాసం మొదలుపెడతాడు.  అలా దెయ్యాల చేతిలో చిక్కుకు పోయిన రాజ్ కిరణ్ బృందం బయటకు రావడానికి ఎలాంటి ప్లాన్ వేశారు, అసలు బయటకు వచ్చారా, లేదా అనేదే కథ.


విశ్లేషణ :


ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సినిమా ఇది. స్టోరీ పాయింట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 'ఆనందోబ్రహ్మ' ఇదే పాయింట్ తో వచ్చింది సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో వ్యవహారం సింపుల్ గా, స్వీట్ గా, నీట్ గా ఉంటుంది. కానీ ఈ సినిమా లో అవేమి లేకపోగా అర్థంకాని కామెడీ తో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచారు. ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే ఈ సినిమాకి డైరెక్టరే లేడు. సినిమా మొదలైన కొద్ది రోజులకే డైరెక్టర్ తో గొడవలు వచ్చి డైరెక్టర్ ను పంపించేశారట. తర్వాత క్రియేటివిటీ ఉన్న వాళ్లంతా తలా ఒక చెయ్యి వేసి ఈ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇంక చెప్పేదేముంది అన్ని చేతులు పడితే సినిమా ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు.. ఈ సినిమాలో పాత్రలు ఎవరికి నచ్చినట్టు వారు వచ్చేస్తూ ఉంటారు వెళ్లిపోతుంటారు ఓ పద్ధతి లేదు పాడూ లేదు, ఓ వైనం లేదు, ఓ వివరం లేదు. 


ప్రస్తుతం హర్రర్ కామెడి సీజన్ నడుస్తోంది అందుకేనేమో బహుశా శ్రీకాంత్ ఇలాంటి ఒక కథను ఎంచుకున్నాడు మంచి ఆలోచన ఏమిటంటే పాపులర్ ఆర్టిస్టులు అందర్నీ సినిమాలోకి తీసుకున్నారు. ఏ సినిమాలోనైనా కథకి అనుగుణంగా ఆర్టిస్టుని మార్చుకుంటారు. కానీ ఈ సినిమా లో మాత్రం ఆర్టిస్ట్ కి సీన్లు రాసేసి వాటిని తీసుకుంటా అందులో కథ చెప్పడానికి ప్రయత్నించారు. ఈ సినిమాలో కథ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎక్కడో చిన్న లింకు పెట్టడం ముడివేయడం సినిమాలోకి తోసేయడం ఇదే జరిగింది. ఒక్క థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి తప్ప మిగిలిన ఆర్టిస్టులందరూ విసగించారు చివరికి శ్రీకాంత్ తో సహా. అది ఆర్టిస్టులు తప్పు అని కూడా అనడానికి లేదు ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టరే లేడు ఆపైన సరైన రైటింగే కనిపించదు. 


సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వస్తే కెమెరామెన్ పనితనం కొంత వరకు బాగుంటుంది. మిగతా విభాగాల పనితీరు పరవాలేదు అంతే.  


ప్లస్ పాయింట్స్ : 


* దర్శకుడే లేకుండా ఒక సినిమాను తీయడం.


* పృథ్వీరాజ్ కామెడీ


మైనస్ పాయింట్స్ : 


* శ్రీకాంత్, మరియు ఈ సినిమాలో ఇతర నటుల నటన.


* ప్రథమార్థం.


* సినిమా కథ మొత్తం ఆనందోబ్రహ్మ సినిమాలోంచి తీసుకున్నట్టు కనిపించింది


 


మొత్తంగా శ్రీకాంత్ నటించిన 'రా..రా..' సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. పొరపాటున శ్రీకాంత్ పిలిచాడని వెళ్తే మాత్రం రెండు గంటలు చుక్కలు చూస్తారు థియేటర్లో. ఒక సినిమాకి దర్శకుడు లేకపోతే ఆ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ సినిమాని ఒకసారి చూడండి. 


Be the first to comment on Ra ra Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!