విడుదల తేది : September 01, 2017, తారాగణం :పి.రవి శంకర్, చరణ్ రాజ్
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.00
Verdict - కథా బలమున్న `ర‌థావ‌రం`

కన్నడ చిత్రాలు తెలుగులో పెద్ద‌గా ఆడిన దాఖ‌లాలు లేవు. కానీ, యూనిక్ కాన్సెప్ట్ కావ‌డం, క‌న్న‌డ‌లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొంది.. భారీ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో  `ర‌థావరం` చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చూపించాల‌న్న‌ ఉద్దేశంతో  అదే నిర్మాత తెలుగులో ఈ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. యాక్ష‌న్ ల‌వ్ స్టోరీకి  మంగ‌ళి ముఖి (హిజ్రాల‌) కాన్సెప్ట్ ని మిక్స్ చేసి తెర‌క్కెక్కించిన `ర‌థావ‌రం` చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం....


ర‌థావ‌రం అంటే సంస్కృతంలో న‌మ్మిన బంటు అని అర్థం.  ఇక క‌థ‌లోకి వెళితే... రథావరం (శ్రీ ముర‌ళి)  ఎమ్మెల్యే ఏడుకొండ‌లు (రవిశంకర్‌) దగ్గర   నమ్మిన బంటుగా పని చేస్తుంటాడు.  ఎమ్మేల్యే మ‌ణికంఠ కోసం రథావరం  ఏ  ప‌ని చేయ‌డానికైనా వెనుకాడ‌డు.  ఈ  క్రమంలో ఎమ్మేల్యే మ‌ణికంఠ‌ను   సిఎమ్‌గా చూడాల‌నుకుంటాడు ర‌థావ‌రం.  దీనికోసం మ‌ణికంట  త‌ను ఎంతగానో న‌మ్మే  ఒక స్వామిజీని  సంప్ర‌దించ‌గా... ఆ స్వామిజీ  మరణించిన ఒక మంగళి ముఖాన్ని (మరణించిన హిజ్రా) చూసినట్లైతే నీ కోరిక నెర‌వేరుతుందంటూ ఎమ్మేల్యే మ‌ణికంట‌కు  చెబుతాడు. కానీ, అది చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం అని కూడా హెచ్చరిస్తాడు.  ఈ ప‌నిని చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు కేవ‌లం `రథావరం` అని త‌న‌కే ఈ ప‌నిని అప్ప‌గిస్తాడు  మ‌ణికంఠ,  తన య‌జమాని కోసం ఎంత రిస్కైనా చేయడానికి వెనుకాడని రథావరం ఆ పనికి ఒప్పుకుంటాడు. కానీ, మ‌ర‌ణించిన మంగ‌ళి ముఖి ముఖాన్ని ఎవ‌రు చూడ‌కుండా ద‌హ‌నం చేయ‌డం హిజ్రాల‌ సంప్ర‌దాయం కావ‌డంతో వారు చాలా సీక్రెట్ గా ద‌హ‌నం చేస్తుంటారు . దీంతో చ‌నిపోయిన మంగ‌ళి  ముఖి శ‌వాన్ని చేజిక్కించుకోవ‌డం  అంత సులువు కాదు.  రెండు సార్లు విఫ‌ల ప్ర‌య‌త్నం చేసి... అది త‌ప్ప‌ని  రియ‌లైజ్ అయి ఎమ్మెల్యే మ‌ణికంఠ‌తో నేను ఆ ప‌ని చేయ‌లేను. మీరు కూడా చేయ‌వ‌ద్దని తెగేసి  చెబుతాడు. ఆ త‌ర్వాత ఎమ్మేల్యే మ‌ణికంఠ ఏం చేశాడు. హీరో త‌న ప్రేమను ఎలా ద‌క్కించుకున్నాడు. త‌న చిన్న‌నాటి మిత్రుడి కోసం ఎలాంటి త్యాగానికి సిధ్ద‌ప‌డ్డాడు అన్నది తెర‌పే చూసి తెలుసుకోవాల్సిందే.


క‌న్న‌డ‌లో రోరింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీ ముర‌ళి ర‌థావ‌రం పాత్రలో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచాడు. మాస్ గెట‌ప్ లో చాలా స్టైలిస్ గా హీరో క్యార‌క్ట‌ర్ ని డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు.  అలాగే క‌న్న‌డ‌లో గ్లామ‌ర్ బ్యూటీగా మంచి పాపులారిటీ ఉన్న ర‌చితా రామ్ అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో చ‌ర‌ణ్ రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. అలాగే హీరో ఫ్రెండ్ సేఫ్టీ మంచి కామెడీ పండించాడు.   ఒకే  సీన్ లో క‌నిపించినా సాధుకోకిల క‌డుపుబ్బ న‌వ్విస్తాడు.   మ‌హాదేవి పాత్ర సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంటుంది. ఇలా న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు.


ఈ సినిమా టెక్నీషియ‌న్స్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా సినిమాటోగ్రాఫ‌ర్ భువ‌న్ గౌడ్ గురించి చెప్పుకోవాలి. క‌థ మూడ్ కు త‌గ్గుట్టుగా సినిమాటోగ్ర‌ఫీ చేసి మంచి మార్కులు కొట్టేశాడు. ముఖ్యంగా యాక్ష‌న్ సీన్స్ , ల‌వ్ సీన్స్ లో సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంటుంది.  ధ‌ర్మ‌విశ్ చేసిన పాట‌ల్లో ``చెలియా క‌న్ను లోడెడ్ గ‌న్ను`` పాట విన‌సొంపుగా ఉంది. అలాగే ల‌వ్ సీన్స్, సెంటిమెంట్స్ సీన్స్  లో నేప‌థ్య సంగీతం బాగా కుదిరింది.  యాక్షన్‌ ఎపిసోడ్స్‌ థ్రిల్‌ కల్గించే విధంగా ఉన్నాయి. మాట‌లు కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.  ముఖ్యంగా దర్శకుడు యూనిక్  కథ`కథనాల‌తో సినిమాను ఆస‌క్తికరంగా...ఒక కొత్త ద‌ర్శ‌కుడు సినిమా చేసాడ‌న్న ఫీల్ ఎక్క‌డా క‌లిగించ‌కుండా తెర‌కెక్కించాడు. నిర్మాణ విలువ‌లు కూడా చాలా బావున్నాయి.


హీరో ఇంట‌ర్ డ‌క్ష‌న్ ద‌గ్గ‌ర నుంచి  క్లైమాక్స్  వ‌ర‌కు ఒకే మూడ్‌ని మెయింటైన్ చేస్తూ ఇంప్రెసివ్ గా న‌టించాడు.  న‌మ్మిన బంటుగా... న‌మ్మిన వారికోసం ఎంత రిస్కైనా చేయ‌డానికి  సిద్ధ‌ప‌డే క్యార‌క్ట‌ర్ లో శ్రీ ముర‌ళి జీవించాడు.  యాక్ష‌న్ స‌న్నివేశాలు రియ‌లిస్టిక్ గా ఉన్నాయి. ఆ మ‌ణికంఠ పులి మీద వ‌స్తే....ఈ మ‌ణికంఠ ఎనుము (దున్న‌పోతు)మీద వ‌స్తాడంటూ ఎమ్మెల్యే మ‌ణికంఠ పాత్ర  హీరోకు స‌రిస‌మానంగా  ఉంటుంది.  ఒక పొలిటిక‌ల్   యాక్ష‌న్ స్టోరీ గా మొద‌లై...ఎప్పుడైతే  మంగ‌ళి ముఖిల (హిజ్రా)ల‌ వైపు  క‌థ ట‌ర్న్ అయిందో అప్ప‌టి నుంచి ఉత్కంఠ భ‌రితంగా క‌థ న‌డుస్తూ ప్రేక్ష‌కుల‌ను సీట్ల‌ను అతుక్కు పోయేలా చేస్తుంది. ముఖ్యంగా చ‌నిపోయిన మంగ‌ళి ముఖి శవం కోసం చేసే ప్ర‌య‌త్నాలు ఇంట్ర‌స్టింగ్ గా ఉంటాయి. మ‌హాదేవి ఎంట‌ర్ అయ్యాక సినిమా రూపే మారిపోతుంది. ర‌థావ‌రంకు, మ‌హాదేవికి మ‌ధ్య సన్నివేశాలు ఉద్వేగ‌భ‌రితంగా ఉంటాయి.  మంగ‌ళి ముఖిలని చంప‌డం పాపం అని హీరో ఎప్పుడైతే  రియ‌లైజ్ అవుతాడో అప్ప‌టి నుంచి క‌థ కొంచెం స్లో అవుతుంది. దీంతో సెకండాఫ్ క‌థ గాడీ త‌ప్పిన‌ట్లైంది.  అదే సెకండాఫ్‌లో కూడా మ‌హాదేవి పాత్ర‌ను ఇంకా పెంచి మంగ‌ళి ముఖిల మీదే క‌థ న‌డిపిస్తే సినిమా మ‌రో రేంజ్‌కి వెళ్లి ఉండేది.  అయినా కూడా  చిన‌నాడు త‌న చ‌నుబాలు పంచిన త‌న మిత్రుడుకోసం త‌న క‌న్నునే దానం  చేయాల‌నుకోవ‌డం, దీనికోసం త‌న ప్రేమ‌ను సైతం త్యాగం చేయాల‌నుకోవ‌డం లాంటి అంశాలు రాడంతో  సినిమాను గ‌ట్టెక్కించాయి. ఓవ‌రాల్ గా ఒక  పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కు ఇంత వ‌ర‌కు సిల్వ‌ర్ స్ర్కీను పై రాని హిజ్రాల క‌థాంశాన్ని జోడించి ఓ విభిన్న‌మైన చిత్రంగా మ‌లిచారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇంత వరకు హిజ్రాల‌కు మాత్రమే ఉన్న ఈ ప్రత్యేకత గురించి ఎవరూ ఏ సినిమాలో చూపించలేదు. దీనికోస‌మైన సినిమా  చూడాల్సిందే. ఎక్క‌డా బోర్ లేకుండా రెండున్న‌ర గంట‌లు హ్యాపీగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది.  ఆడ‌, మ‌గ మాత్ర‌మే కాదు  థర్డ్‌ జెండర్స్ కూడా   డోంట్ మిస్ ర‌థావ‌రం.


Be the first to comment on Rathavaram Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!