విడుదల తేది : February 23, 2018, తారాగణం :emp
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
2.50
Verdict - విక్రమ్ కి బ్యాడ్ టైం నడుస్తుంది..

నటీనటులు : విక్రమ్, తమన్నా


దర్శకత్వం : విజయ్ చందర్


నిర్మాత : మూవింగ్ ఫ్రేమ్


సంగీతం : ఎస్. థమన్


సినిమాటోగ్రఫర్ : ఎం. సుకుమార్


ఎడిటర్ : రూబెన్


చియాన్ విక్రమ్ ఒక నట విశ్వరూపం, ఆయన ఒళ్ళంతా నటనే, శరీరంలో ప్రతి భాగం నటిస్తూ ఉంటుంది, అంత గొప్ప నటుడు విక్రమ్. విజయ్ చందర్ దర్శకత్వంలో మూవింగ్ ఫ్రేమ్ నిర్మాత బాధ్యతలు స్వీకరించిన సినిమా 'స్కెచ్'. చియాన్ విక్రమ్, తమన్నా ఈ సినిమాలో జంటగా నటించారు. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా మొన్న సంక్రాంతికి తమిళం లో విడుదలైంది. అయితే ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.


కథ : 


జీవా ఒక ఆకతాయి కుర్రాడు కానీ స్కెచ్ వేశాడంటే దానికి ఎంతటి వారైనా పడాల్సిందే. అందుకే అందరూ ఆ కుర్రాన్ని స్కెచ్ అని పిలుస్తారు. స్కెచ్ (విక్రమ్) వాయిదాలు కట్టని బైకులను, కార్లను ఎత్తుకొచ్చి డబ్బులు వసూలు చేసే దందాలో ముఖ్యుడుగా ఉంటాడు. కొన్నేళ్ల క్రితం ఒక రౌడీ తన యజమాని దగ్గర డబ్బు తీసుకుని కారు కొని వాయిదాలు ఎగ్గొడతాడు. దాంతో యజమాని స్కెచ్ తో ఆ కారును ఎత్తుకు రమ్మని చెప్తాడు. ప్రశాంతంగా సాగిపోయే తన జీవితం ఇక్కడ మలుపు తిరుగుతుంది.


యజమాని మాట మేరకు స్కెచ్ ఆ కారుని ఎత్తుకొస్తాడు. దాంతో కక్ష కట్టిన ఆ రౌడీ స్కెచ్ ను, అతని ముగ్గురు స్నేహితుల్ని చంపాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న రౌడీ వాళ్ళను ఎలా చంపాడు, ఆ రౌడీ పై స్కెచ్ ఎలా పగ తీర్చుకున్నాడు, చివరికి స్కెచ్ జీవితం ఏమైంది అనేదే సినిమా.


విశ్లేషణ : 


'స్కెచ్' అందరిని బాగా ఆకట్టుకున్న టైటిల్. ఈ సినిమాలో విక్రమ్ నటిస్తున్నాడని తెలియగానే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి, తమన్నా హీరోయిన్ గా నటించడంతో అంచనాలు మరికాస్త పెరిగాయి కానీ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. కారణం విక్రమ్ మంచి నటుడే కావచ్చు కాని ఒక సినిమాలో నటన మాత్రం బాగుంటే సరిపోదు కదా.. ఆ నటనను సరైన రీతిలో చూపించే దర్శకుడు కూడా ఉండాలి, ఈ సినిమాలో దర్శకుడు విజయ్ చందర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సినిమా దర్శకుడు ఈ సినిమాకి రచయిత కూడా, కథను చెప్పడంలో ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. స్టోరీ లో హీరో పాత్రని బాగా తీర్చిదిద్దారు ఈ ఒక్క అంశాన్ని తప్పించి సినిమాలో ఏ విభాగంపై కూడా దర్శకుడు అంత శ్రద్ధ కనపరచలేనట్టే కనిపిస్తుంది. హీరో నటన చాలా బాగుంది.  పేరు పెట్టడానికి లేదు. విక్రమ్ అన్ని సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా తన నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాలో విక్రమ్ నటన అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తమన్నా  పరవాలేదు. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రలకు తగ్గట్టుగా చాలా బాగా చేశారు. సాంకేతిక అంశాలు విషయానికి వస్తే దర్శకుడు తప్పించి మిగతా అన్ని విభాగాలు బాగానే పనిచేశాయి. నిర్మాతలు సినిమాకి అవసరానికి మించి ఖర్చు చేసినట్టు అనిపిస్తుంది. 


తమన్ మ్యూజిక్ బాగుంది. మధ్యలో కొన్ని చోట్ల ఇంగ్లీషు పాటలు పోలినట్టు ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకే హైలెట్గా నిలిచింది. ఎడిటర్ రూబెన్, సినిమాటోగ్రఫర్ ఎం. సుకుమార్ పనితనం ఆకట్టుకుంటుంది. 


బలం, బలహీనతలు


ప్లస్ పాయింట్స్:


* చియాన్ విక్రమ్ నటన ఒక అద్భుతం.


* ఇంటర్వెల్ ముందు సన్నివేశం.


* ఫైట్ సీన్స్ మరియు హీరోని చూపించే విధానం.


మైనస్ పాయింట్స్ : 


* దర్శకుడు పనితీరు


* స్టోరీలో కొత్తదనం లేకపోవడం, ఎక్కడో చూసిన సన్నివేశాలు.


* క్లైమాక్స్


* కథపై దర్శకుడు కి అంత పట్టు లేనట్టే అనిపిస్తుంది.


 


మొత్తంగా చెప్పుకోవాలంటే, స్కెచ్ సినిమా తమిళంలో ముందుగానే విడుదలై చాలా పెద్ద అపజయాన్ని మూటకట్టుకుంది.  ఆ నష్టాన్ని కొంతైనా తిరిగి భర్తీ చేయడానికి ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారని చెప్పుకోవచ్చు. అన్నీ కలిసొస్తే ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తాయేమో కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాత్రం కనిపించట్లేదు. ఒళ్ళంతా నటనతో నింపుకున్న చియాన్ విక్రమ్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు, అద్భుతంగా నటించాడు ఈ సినిమాలో విక్రమ్. 


Be the first to comment on Sketch Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!