wallpaper
celebrity

వరుణ్ తేజ్ తొలిప్రేమ
Views : 11365

3.50
|
|
Write a Review
విడుదల తేది : February 10, 2018, దర్శకుడు : , నిర్మాత : బివీస్ న్.ప్రసాద్ , సంస్థ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, తారాగణం :వరుణ్ తేజ్ బాబు, రాశిఖన్నా
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.50
Verdict - తొలిప్రేమ
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
3.50
Verdict - అందమైన ప్రేమ జంట..

నటీనటులు : వరుణ్ తేజ్, రాశి ఖన్నా, సుహాసిని, మణిరత్నం


దర్శకత్వం : వెంకి అట్లూరి


నిర్మాత : బి వి ఎస్ ఎన్ ప్రసాద్


సంగీతం : S. థమన్


సినిమాటోగ్రఫర్ : జార్జి సి. విలియమ్స్


ఎడిటర్ : నవీన్ నూలి


మెగా వారసుడు వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం 'తొలిప్రేమ', ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై ఈ చిత్రం నిర్మించారు బీవీఎస్ఎన్ ప్రసాద్. వరుణ్ తేజ్ ముందు చిత్రమైన 'ఫిదా' మంచి విజయం సాధించడంతో అభిమానుల్లో ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు పెంచుకున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు తొలిప్రేమ సినిమా అందుకుందో లేదో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం.


కథ: 


ఆదిత్య(వరుణ్ తేజ్) ఒక గొప్పింటి కుర్రాడు, అతిగా ఆవేశపడటం, ముందు వెనుకా ఆలోచించకుండా మాట్లాడడం ఇవి ఇతని లక్షణాలు. చదువులో కూడా ఆదిత్య మొదటి స్థానంలో ఉంటాడు. ఇలాంటి ఒక కుర్రాడు తన చదువును వైజాగ్ లో పూర్తి చేసుకుని తిరిగి తన ఇంటికి ప్రయాణమవుతాడు. వైజాగ్ నుండి హైదరాబాద్ కు వెళ్లే సమయంలో ఆదిత్య (వరుణ్ తేజ్ )కు వర్ష (రాశీఖన్నా) పరిచయమవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. వర్షా కూడా తన ప్రేమను అంగీకరించినట్టే కనిపిస్తుంది కానీ విధి ఇద్దరినీ విడదీస్తుంది. మూడు నెలల తర్వాత ఆదిత్య చదివే అదే కాలేజీలో వర్షా కనిపిస్తుంది. అక్కడి నుంచి వీరిద్దరి ప్రేమాయణం మొదలవుతుంది. కాలేజీలో జరిగే చిన్న గొడవతో ఇద్దరు విడిపోతారు. 


ఆ సంఘటనతో ఆది లండన్ వెళ్లి పోతాడు. అక్కడ తనకు నచ్చిన ఫ్రెండ్స్ తో హ్యాపీ గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే తను చేసే పని విషయంలో తిరిగి మళ్లీ వర్ష ను కలుస్తాడు. వీరిద్దరూ మళ్లీ కలుస్తారా..? లేక విడిపోతారా..? అసలు ఏం జరుగుతుంది..? అనేది మిగిలిన కథ


విశ్లేషణ : 


జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా అవి ఎప్పుడూ మనతోనే ఉంటాయి మోయక తప్పదు, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మంచి జ్ఞాపకాలు కంటే మనం చెడ్డ  జ్ఞాపకాలనే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. మనుషులమైన మనం ప్రేమను మర్చిపోతాము.  తప్పులను మాత్రమే గుర్తిస్తాము. ఈ విషయం హీరో అర్థం చేసుకోవడమే ఈ సినిమా. కొత్త దర్శకుడైన వెంకీ అట్లూరి ఈ సినిమాని చాలా బాగా తీసుకువెళ్లాడు. ఎక్కడా ప్రేక్షకులకి నిరాశ కలిగించకుండా ఒక జరిగిన కథ రూపంలో ఈ కథను చెప్పడానికి ప్రయత్నించాడు. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా రాసుకున్నాడు అంతే చక్కగా తెరపై చూపించాడు కూడా, వెంకీ అట్లూరి దర్శకత్వ ప్రతిభకు వందకు వంద మార్కులు వేయొచ్చు అంత చక్కగా తీశాడు సినిమా. ఎక్కడో చూసినట్టే ఉంటుంది కానీ మనసుకు ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది అదే ఈ సినిమా ప్రత్యేకత. ఈ సినిమా కథలో లీనమయ్యే కొద్దీ ప్రేక్షకుడు తనని తాను మర్చిపోయి సినిమాల్లోకి వెళ్లిపోతాడు. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలను సాగ తీసినప్పటికీ అది సినిమా మాయలో కనిపించలేదు. దర్శకత్వం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కథ బాగుంది. ప్రతి విభాగం చాలా చక్కగా పనిచేసింది అని చెప్పొచ్చు.


అది, వర్ష మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు యువతని బాగా ఆకట్టుకుంటాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ ఉన్న ప్రేమకథను మనం ఈ సినిమాలో చూస్తాం. వరుణ్ తేజ్ చాలా అందంగా కనిపించాడు, తను పడ్డ కష్టం సినిమాలో కనిపించింది. ఈ సినిమా కోసం తనని తాను చాలా మార్చుకున్నాడు వరుణ్. రాశీఖన్నా కూడా తన పాత్రకు తగ్గట్టుగా చాలా బాగా నటించింది. అందం అభినయం కలగలిసిన అమ్మాయిగా రాశిఖన్నా నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఇతర నటీనటుల విషయానికొస్తే ప్రియదర్శిని నటన పర్వాలేదు. హైపర్ ఆది ఈ సినిమాలో కూసింత ఎక్కువ సేపే కనిపిస్తాడు. అందర్నీ బాగా నవ్విస్తాడు. తమన్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. 


బలం బలహీనతలు


ప్లస్ పాయింట్స్:


* వరుణ్ తేజ్ మరియు రాశి ఖన్నా నటన


* రెండో భాగం


* డైలాగ్స్, స్క్రీన్ ప్లే


* థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్


* నిర్మాణ విలువలు.


మైనస్ పాయింట్స్:


* మొదటి భాగంలో కొన్ని సన్నివేశాల సాగదీత.


* కొన్నిచోట్ల ఎక్కడో చూసినట్టు కలిగే భావం.


* ఫ్యామిలీ ఆడియెన్స్ కి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం.


మొత్తంగా చెప్పుకోవాలంటే, తొలిప్రేమ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుంది, కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. అన్ని విభాగాల పనితీరు బాగుంది. మొత్తానికి వరుణ్ తేజ్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా మీకు ఎంత అర్థమైతే అంతబాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ప్రేమికులకు ఒక గిఫ్ట్ లాంటిది అని చెప్పొచ్చు. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వదు.. తప్పక చూడండి!


Be the first to comment on Varun tej TholiPrema Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
తొలి ప్రేమ న్యూ స్టిల్స్
తొలి ప్రేమ టైటిల్ పోస్టర్
తొలి ప్రేమ మూవీ స్టిల్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News