ఏ మంత్రం వేసావే | ఏ మంత్రం వేసావే Review | Rating | ఏ మంత్రం వేసావే News | Release Date | In Theaters | ఏ మంత్రం వేసావే Pics | Photos | Images | Wallpapers | ఏ మంత్రం వేసావే Direcrtor | Producer | Music | Cast | Technicians :: TollywoodTimes
విడుదల తేది : March 09, 2018, దర్శకుడు : , నిర్మాత : , , టేక్నిషియన్ : ధర్మేంద్ర కాకర్ల, తారాగణం :విజయ్ దేవరకొండ, ,
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
2.00
Verdict - 'అర్జున్ రెడ్డి' అనే సూపర్ హిట్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నుంచి ఆశించే సినిమా ఇదే నా...

నటీనటులు : విజయ్ దేవరకొండ, శివానీ సింగ్


నిర్మాత : శ్రీధర్ మర్రి


సంగీతం : అబ్దస్ సమద్


సినిమాటోగ్రఫర్ : శివ రెడ్డి


ఎడిటర్ : ధర్మేంద్ర కాకర్ల


 


విజయ్ దేవరకొండ ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్, యూత్ లో సరికొత్త సంచలనం. అందరికీ తెలిసిందే అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్టు తో విజయ్ దేవరకొండ పేరుకు ఆ బ్రాండ్ వచ్చింది. 'అర్జున్ రెడ్డి' సినిమాని అమితంగా ఇష్ట పడిన తెలుగు ప్రేక్షకులు విజయ్ దేవరకొండ నుంచి మరొక సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి టైంలో ఊహించని సర్ప్రైజ్ లాగా వచ్చింది 'ఏ మంత్రం వేసావే' సినిమా. ఈ సినిమా ఈ వారం థియేటర్లలోకి వచ్చింది ఆ సినిమా విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 


 


కథ :


నిఖిల్ (విజయ్ దేవరకొండ) ఇంట్లోంచి బయటి వెళ్లకుండా ఎప్పుడూ వీడియో గేమ్స్, సోషల్ మీడియా అంటూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను కూడ బాధపెడుతుంటాడు. అలాంటి అతను సోషల్ మీడియా ద్వారా రాగమాలిక (శివానీ సింగ్) అనే అమ్మాయిని ఇష్టపడి ఆమెకు దగ్గరవ్వాలనుకుంటాడు.


కానీ రాగమాలిక మాత్రం నిఖిల్ మెంటాలిటీని అంచనా వేసి తనని కలవాలంటే ఒక గేమ్ ఆడాలని అతనికి ఛాలెంజ్ విసురుతుంది. ఆ గేమ్ ఏంటి, నిఖిల్ దాన్ని ఎలా ఆడాడు, చివరికి ఆమెను ఎలా చేరుకున్నాడా లేదా, అసలు రాగమాలిక, నిఖిల్ కు అలాంటి ఛాలెంజ్ ఎందుకు విసిరింది అనేదే ఈ సినిమా కథ.


 


విశ్లేషణ :


 'ఏ మంత్రం వేశావే' ఈ సినిమా టైటిల్ కి కథకు ఏ మాత్రం సంబంధం లేదు. ఏ మాయ చేసావే సినిమాలో నాగచైతన్య సమంత ప్రేమలో పడటం అనేది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది వివరంగా చెప్పలేని పరిస్థితి  అలాంటి ఫీలింగ్ కలిగించే టైటిలే 'ఏం మాయ చేసావే' కానీ ఈ సినిమా లో ఏ మంత్రం వేసావే అని ఫీల్ అయ్యే అవకాశం ఈ సినిమాలో ఎక్కడా ఉండదు. 


 


బేసిక్ గా ఈ సినిమా ఒక గేమ్, చాలెంజ్, మెసేజ్ వాటి మధ్యలో సన్నగా ఎక్కడో ప్రేమ అనే మాట ఉంటుంది అంతే తప్ప ప్రేమ అనే మేటర్ ఈ సినిమాకి హైలెట్ కాదు. ఈ సినిమా కి దర్శకుడే నిర్మాత, రైటర్ కూడాను. ఈ సినిమా కథ ను చెప్పడం కోసం ఆయన అనుకున్న పాయింట్, చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగున్నాయి కానీ స్క్రీన్ప్లేని డిజైన్ చేసుకున్న విధానం కథను చెప్పే విధానం అస్సలు ఏం బాగా లేవు. దర్శకుడు శ్రీధర్ మర్రి ఈ సినిమాను ప్రజెంట్ చేసే విధానం లో క్రియేటివిటీ లోపం కనిపించింది. అలాగే బడ్జెట్ కాంప్రమైజస్  కూడా ఉన్నాయి.  ప్రొఫెషనల్ ఫిలిం మేకింగ్ కనిపించలేదు.  ఫిలిం మేకింగ్ మీద పట్టు అయితే దర్శకుడికి లేదు. ఎ విభాగంపై కూడా ఆయనికి సరైన పట్టు ఉన్నట్టు అనిపించలేదు అయినప్పటికీ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, నిర్మాత అన్నీ ఆయనే చేసేసారు. ఉత్సాహం, ఆసక్తి ఉండడంలో తప్పులేదు కానీ నేర్చుకుని  సినిమా తీసినట్టు అయితే చాలా బాగుండేది.  ఒక మంచి పాయింట్ చెప్పాలి అని అనుకున్నారు కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న క్యారెక్టర్లు, సన్నివేశాలు, స్క్రీన్ ప్లే ఏమాత్రం బాగోలేదు. అయినా అవకాశం దొరికినప్పుడు అల్లా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అలాంటి అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి ఈ సినిమాలో.  హీరోయిన్ విషయానికొస్తే ఆమె క్యారెక్టర్ కూడా పెద్ద ఇంటరెస్టింగా ఏమీ ఉండదు. ఆర్టిస్ట్ కూడా పెద్ద అభినయం కూడా ప్రదర్శించలేదు. మిగతా ఆర్టిస్టులు కూడా ఏదో మమా అనిపించారు గానీ నీట్ గా ఉండే పెర్ఫార్మెన్స్ లేమీ ఈ సినిమాలో కనిపించవు.


 


బలం బలహీనతలు


ప్లస్ పాయింట్స్:


* విజయ్ దేవరకొండ నటన, శివానీ సింగ్


* స్టోరీ లైన్ 


* అక్కడ అక్కడ కొన్ని సీన్లు


 


మైనస్ పాయింట్స్:


* డైరెక్షన్ బాగాలేదు


* కథ నడిపే విధానం బాలేదు


* హీరో క్యారెక్టైజేషన్ అంత బాలేదు 


* ప్రొడక్షన్ వాల్యూస్ అసల బాలేదు.


 


మొత్తంగా 'ఏ మంత్రం వేసావె' సినిమా గురించి చెప్పుకోవాలంటే 'అర్జున్ రెడ్డి' అనే సూపర్ హిట్టు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నుంచి ఆశించే సినిమా ఇది కాదు, డైరెక్టర్ శ్రీధర్ మర్రి అనుకున్న కాన్సెప్ట్ ని సరిగా డీల్ చేయడంలో ఫెయిలయ్యాడు, దానికితోడు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ ని చాలా నిరాశ పరుస్తుంది, కాబట్టి విజయ్ దేవరకొండ కోసం అయితే ఈ సినిమాని అస్సలు చూడొద్దు. 


Be the first to comment on Ye Mantram Vesave Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!