విడుదల తేది : February 23, 2018, దర్శకుడు : , తారాగణం :చిరంజీవి కొణిదెల, , పలక్ లల్వాని, యం.యం.కీరవాణి
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
2.00
Verdict - రెగ్యులర్ కమర్షియల్ సినిమానే కానీ హీరో నటన బాగుంది.

నటీనటులు : రంజిత్‌, పాలక్‌ లాల్వాని, అర్జున్


దర్శకత్వం : త్రికోటి.పి


నిర్మాత : డా. భరత్‌ సోమి


సంగీతం : ఎమ్‌.ఎమ్‌. కీరవాణి


సినిమాటోగ్రఫర్ : సురేష్


ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావ్


‘నువ్వు నేను ఒకటవుదాం’ సినిమాతో హీరోగా పరిచయమైన రంజిత్ సోమి కొంత గ్యాప్ తరువాత ‘జువ్వ’ సినిమాతో హీరోగా తిరిగి పరిచయమవుతున్నాడు. ఎం.ఎం.కీరవాణి ఎం.రత్నం, కోటగిరి వెంకటేశ్వరరావు వంటి పెద్దపెద్ద సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో పనిచేశారు. 2014లో దిక్కులు చూడకు రామయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. డా. భరత్‌ సోమి ఈ సినిమాకి నిర్మాతగా పనిచేశారు. 'జువ్వ' సినిమా ఈ శుక్రవారం ధియేటర్ లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.


 


కథ:


శ్రుతి (లాల్వానీ‌) చిన్ననాటి నుండే బసవరాజు (అర్జున్) ప్రేమిస్తూ ఉంటాడు అది శ్రుతి కి ఇష్టం లేక విలన్ నుంచి పారిపోతూ ఉంటుంది. తను చేసేది తప్పు అంటూ బసవరాజు నిందించిన టీచర్ని హతమార్చిన నేరం కారణంగా బసవరాజు జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్ష ముగించుకుని తిరిగి శ్రుతి కోసం బయలుదేరుతాడు. ఇంతలో శ్రుతి రాణా(రంజిత్‌)ను ప్రేమిస్తుంది. రాణాకు కూడ శ్రుతి సమస్య తెలుస్తుంది. ఆ తరువాత రాణా బసవరాజు నుండి శ్రుతిని ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ. 


విశ్లేషణ : 


రంజిత్‌ సోమి ఈ సినిమా మొత్తానికి ప్రధాన బలం గా నిలిచాడు. డ్యాన్సులు, నటన, మరి కొన్ని విభాగాల్లో బాగానే నటించాడు. ఇంకాస్త ట్రైనింగ్ ఇస్తే ఒక మాంచి హీరోగా గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక సినిమా విషయానికొస్తే 'జువ్వ' అనే టైటిల్ కి సరైన రీతిలో న్యాయం జరగలేదు. ఏదో మాస్ అపీల్ కోసం పెట్టినట్టు అనిపిస్తుంది అంతేకానీ మరే విధమైన కారణాలు లేవు. ఇకపోతే డైరెక్టర్ త్రికోటి ప్రేక్షకులకు కథను చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కనీసం ఈ సినిమాను తీసి విధానమైనా సరిగ్గా ఉందా అనుకుంటే అదే లేదు, ఒక పాత ఫార్ములా కథను తీసుకుని మళ్ళీ తిరిగి అంతే పాత కథనాన్ని జోడించి తెరకెక్కి చేశారు. సంచలనం బాహుబలి సినిమాకి సంగీతదర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాలో తనదైన మార్కును ప్రదర్శించలేకపోయారు. ఒక్క విలన్ పాత్రకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తెప్పించి సినిమాలో ఎక్కడా కూడా తన సంగీత ప్రతిభను చూపించలేకపోయారు. లెజెండ్, మగధీర వంటి ఎన్నో చిత్రాలకి మాటలు రాసిన ఎం.రత్నం కూడా తన మార్క్ రూబీ లేకపోయాడు. 


సినిమాటోగ్రఫీ సురేష్ పనితనం బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన పని తను చేసుకుంటూ పోయాడు. హీరోయిన్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు అంతా కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా బాగానే చేశారు. కథ,కథనం పాతది కావడం తో ఈ సినిమా ప్రేక్షకులను అంత బాగా ఆకట్టుకోలేదు.


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ :


* హీరో నటన.


* కొన్ని కొన్ని చోట్ల ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.


* హీరోయిన్ పరవాలేదు.


మైనస్ పాయింట్స్ :


* పాత కథ, కథనం.


* నిరుత్సాహపరిచే దర్శకత్వం.


* అర్థంకాని కామెడీ.


* సెకండాఫ్.


 


మొత్తంగా చెప్పుకోవాలంటే, 'జువ్వ' సినిమా ఒక పాత రొటీన్ కథ, కథనం. ఈ సినిమాకి పనిచేసిన పెద్ద పెద్ద వారు అంతా ఏదో సరదాగా పని చేసినట్టు ఉన్నారు కానీ ప్రేక్షకులకు ఈ సినిమా వలన ఇటువంటి సరదా లభించదు. ఈ సినిమాలో హీరో రంజిత్ టాలెంట్ ఉన్న నటుడే కానీ రంజిత్ ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది.


Be the first to comment on juvva Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!