wallpaper
celebrity

మహానటి
Views : 8121

4.00
|
|
Write a Review
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
4.00
Verdict - మహానటి రివ్యూ : ఒక అద్భుతం, ఎంత అర్థం అయితే అంత మజా....!
నటీనటులు : కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ


దర్శకత్వం : నాగ్ అశ్విన్


నిర్మాతలు : ప్రియాంక దత్, స్వప్న దత్


సంగీతం : మిక్కీ జె మేయర్


సినిమాటోగ్రఫర్ : డాని


ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు


స్క్రీన్ ప్లే : నాగ్ అశ్విన్


తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ‘మహానటి’ సినిమా వచ్చేసింది. మహానటి సావిత్రిగారి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈవారం విడుదలైంది, సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా.. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


కథ:


పల్లెటూరి నుండి మద్రాస్ చేరుకుని  సామాన్యురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నిస్సంకర సావిత్రి (కీర్తి సురేష్) తన అభినయంతో మహానటిగా, మంచి మనసుతో సావిత్రమ్మగా ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారు, తన సహా నటుడు జెమినీ గణేశన్ (దుల్కర్ సల్మాన్) తో ఎలా ప్రేమలో పడ్డారు, అతనితో ఆమె ప్రేమ, వైవాహిక జీవితం ఎలా సాగింది, నమ్మిన వాళ్ళే మోసం చేస్తే మనసు చెదిరి మద్యానికి బానిసై జీవిత చరమాంకంలో ఆమె ఎలాంటి క్షోభను, కష్టాల్ని అనుభవించారు, చివరికి ఈ లోకం నుండి ఎలా నిష్క్రమించారు అనేదే ఈ సినిమా.


విశ్లేషణ :


ఒక నిజమైన ప్రయత్నం చేశారు, మంచి ఫలితాన్ని పొందుతున్నారు. మహానటి సావిత్రి గారి బాల్యం నుంచి ఆవిడని మరణం వెంటాడే వరుకు ఆవిడ జీవితంలో చోటుచేసుకున్న సంగతులు గురించి క్లుప్తంగా వివరిస్తూ, అందంగా చూపిస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. నేటి యువతకు సావిత్రి గారి గొప్పతనాన్ని, ఆ కాలం వారికి నటి సావిత్రి గారి 'క్షమించాలి' మహానటి సావిత్రి గారి గురించి ఇంకా బాగా తెలుసుకునేలా చేసిన చిత్రం ఇది. చరిత్ర తెలుసుకోవడం ఉపయోగం, సావిత్రి గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది. ఆవిడ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి, ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఒక ఆసాధారణమైన స్థాయికి ఎదిగారు, ఆవిడ ఒక మొండి ఘటం పొరపాటున ఎవరైనా నువ్వు చేయలేవు, ఈ పనికి నువ్వు పనికిరావు అంటే చాలు ప్రాణం పెట్టయినా నేర్చుకుంటారు, నేర్చుకోవడం మాత్రమే కాదు మరెవ్వరూ చేయలేని విధంగా చేస్తారు ఎవరైతే నువ్వు పనికిరావు అన్నారో వారే సలాం కొట్టేలా చేసుకుంటారు, అది ఆవిడ గొప్పతనం ఎంతో నేర్చుకోవచ్చు ఈ తరం నటులు ఆ మహానటి దగ్గర నుంచి. అదేవిధంగా అతి మంచితనం, అతిగా మనుషులను నమ్మడం వంటి పొరపాట్లు కూడా ఆవిడ జీవితంలో ఉన్నాయి.


నాగ్ అశ్విన్ చాలా తెలుసుకుని ఈ సినిమా తీశారు. సావిత్రి గారి జీవితం గురించి మాత్రమే కాకుండా అప్పటి పరిస్థితుల గురించి కళ్లకు కట్టినట్టు చూపించారు. సినిమాలో నటీనటులు కూడా చాలా అందంగా నటించారు. ఎస్వీ రంగారావు గారి పాత్రలో మోహన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్రలో నాగచైతన్య, కెవి రెడ్డి పాత్రలో క్రిష్ చక్కగా చేశారు, పెద్ద పెద్ద స్థాయిలో వున్న వారు కాబట్టి కొంచెం ఎక్కువ సేపు చూపించే ప్రయత్నం కూడా చేయలేదు దర్శకుడు, మొత్తం సినిమాని కీర్తి సురేష్ ద్వారానే నడిపించాడు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వారి పాత్రలకు తగ్గట్టుగా చాలా బాగా చేశారు. సినిమాలో అగ్ర తాంబూలం కీర్తి సురేష్ కే దక్కుతుంది, తన కష్టం కనిపించింది, సావిత్రి గారిలా ఆవిడ చేసిన నటన ఒక అద్భుతం. ఆవిడ పాత్రలో చాలా చక్కగా చేశారు, ఎంతో నేర్చుకుంటే కానీ ఇలా చేయలేరు. సినిమా ఆఖరి లో సమంత నటించిన తీరు ప్రేక్షకులతో కన్నీరు పెట్టించాయి. 


నాగ్ అశ్విన్ పనితిరును మెచ్చుకోవాలి, ముఖ్యంగా ఫస్టాఫ్ లో చాలా చక్కగా రాసుకున్నాడు. కథ చెప్పే విధానం, చక్కటి స్క్రీన్ ప్లే సినిమాకు అదనపు ఆకర్షణ. సినిమాలో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అవగలిగితే మాత్రం ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది అనడంలో సందేహం లేదు.


బలం బలహీనతలు


ప్లస్ పాయింట్స్ :


* కీర్తి సురేష్ నటన.


* నాగ్ అశ్విన్ పనితనం.


* ప్రొడక్షన్ వ్యాల్యూస్.


* ఫస్టాఫ్, క్లైమాక్స్.


* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.


మైనస్ పాయింట్స్ :


* సెకండాఫ్ మొదట్లో కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది.


* పాటలు అంత బలంగా లేవు.మొత్తంగా చెప్పుకోవాలంటే 'మహానటి' సినిమా ఒక అద్భుతం, మనం ఎంత అర్థం చేసుకుంటే అంత గొప్ప అనుభూతిని పొందుతాము. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్నాము అని కాకుండా ఒక మహానటి గురించి తెలుసుకుంటున్నాము అని చూసినట్లయితే తప్పకుండా నచ్చుతుంది.

Be the first to comment on mahanati Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
మహానటి సావిత్రి గారి ఒకప్పటి ఇంటర్వ్యూ లో మొఖ కవళికలు ద్వారా సమాధానాలు ఇచ్చారు : 1963
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోస్
Videos
Load moreవీడియోస్!!!
Latest News
Juke box