విడుదల తేది : May 11, 2018, దర్శకుడు : పూరి జగన్నాధ్, తారాగణం :పూరి జగన్నాధ్, నేహా శెట్టి , ఆకాష్ పూరి
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
2.50
Verdict - పూరీ జగన్నాథ్ లెక్క తప్పింది.

నటీనటులు : ఆకాష్ పూరీ, నేహా శెట్టి


దర్శకత్వం : పూరీ జగన్నాథ్


నిర్మాత : పూరీ జగన్నాథ్


సంగీతం : సందీప్ చౌత


సినిమాటోగ్రఫర్ : విష్ణు శర్మ


ఎడిటర్ : జునైద్‌ సిద్ధిఖీ


స్క్రీన్ ప్లే : పూరీ జగన్నాథ్


 


మన తెలుగు చలన చిత్రాలలో పూరీ జగన్నాథ్ తీసిన చిత్రాలు చాలా ప్రత్యేకంగా వుంటాయి. ఆయన సినిమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి ఇడియట్, బద్రీ, పోకిరి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం. కానీ ఈమధ్య పూరీ ట్రాక్ తప్పారు.  అయినా సరే ఏమీ పట్టించుకోకుండా సినిమాలు తీస్తూనే వునారు కానీ ఈసారి ఒక కొత్త ప్రయత్నం చేసాడు.  తన కొడుకుని హీరో గా పరిచయం చేస్తూ సరిహద్దులు దాటిన ప్రేమ కథ ను చూపించడానికి సిద్ధమయ్యాడు పూరీ, మరి తిరిగి గాడిలో పడ్డాడా లేదో చూద్దాం.


 


కథ:


దేశం మీద ప్రేమతో ఆర్మీలో చేరాలనే ప్రయత్నాల్లో ఉంటాడు రోషన్ (ఆకాష్ పూరీ). కానీ అతన్ని గత జన్మ తాలూకు ప్రేమ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. అలాంటి సమయంలోనే అతను హిమాలయాలకు ట్రెక్కింగ్ కు వెళ్లగా తన గత జన్మ ప్రేమ గురించి తెలుస్తుంది.


తన గత జన్మలోని ప్రేయసి ఈ జన్మలో అఫ్రిన్ (నేహా శెట్టి)గా పుట్టిందని, ఆమె పాకిస్థాన్ లో ఉందని


గ్రహించి ఆమె కోసం పాకిస్థాన్ వెళతాడు. అలా పాకిస్థాన్ వెళ్లిన రోషన్ గత జన్మలో కోల్పోయిన ప్రేమను ఈ జన్మలో పొందడానికి ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ సినిమా.


 


విశ్లేషణ :


ప్రేమకు ఎలాంటి సరిహద్దులు ఉండవు అనే విషయాన్ని స్టోరీ లైన్ గా తీసుకుని కథ రాసుకున్నారు పూరీ. ఒక జన్మలో ఓడిపోయిన ప్రేమను తిరిగి మరో జన్మలో గెలిపించుకునేందుకు ఒక ప్రేమ జంట ఎటువంటి ప్రయత్నాలు చేశారు, హైదారాబాద్ లో మొదలైన తమ ప్రేమ ప్రస్థానం పాకిస్తాన్ కి చేరుకుని తిరిగి భారత్ - పాక్ దేశ సరిహద్దుల మధ్య ముగుస్తుంది. వినడానికి చాలా చక్కగా అందంగా ఉంది, కానీ ఈ సినిమాని చూడ్డానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. పూరీ అనుకున్నది అనుకున్నట్టు తీయలేకపోయాడు సరే... కానీ కనీసం గత చిత్రాల మాదిరి కూడా తేయలేకపోయారు. పూరీ గారి ప్రతి సినిమా నుంచి సినీ అభిమానులు చాలా ఆశిస్తూ వుంటారు కాని ఇలాంటి ఒక సినిమా తీస్తారు అని ఎవరూ ఊహించి ఉండరు. 


ఆకాష్ పూరి సరిగ్గా 6సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ లో చిన్నపిల్లాడిగా నటించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు కానీ తన పాత్రకు తగ్గట్టు చాలా చక్కగా చేశాడు, డైలాగ్ డెలివరీ బాగుంది, స్టైల్, యాక్షన్ చూడచక్కగా ఉన్నాయి. హీరోయిన్ నేహా శెట్టి విషయానికొస్తే అందం అభినయంతో బాగానే ఆకట్టుకున్నా ఎమోషనల్ సన్నివేశాలలో తేలిపోయింది. మిగిలిన టెక్నీషియన్స్ అందరూ కూడా పూరిజగన్నాథ్ ని ఫాలో అయిపోయారు. సందీప్ చౌత చక్కటి సంగీతాన్ని అందించారు. 


ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కొన్ని చోట్ల హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు వారి పాత్రకు తగ్గట్టు బాగానే చేశారు, ఫస్టాఫ్లో నడిచే స్క్రీన్ ప్లే చిరాకు పుట్టిస్తుంది. సినిమా ఇంటర్వెల్ కి చేరేసరికి తర్వాత వచ్చే కథేంటో పూర్తిగా అర్థమైపోతుంది,  క్లైమాక్స్ ఫరవాలేదనిపించింది కానీ సెకండాఫ్ ఈ సినిమాకి పెద్ద డ్రా బ్యాక్ గా చెప్పుకోవాలి.


 


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ :


* హీరో నటన


* కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు


 


మైనస్ పాయింట్స్ :


* పూరి జగన్నాథ్ డైరెక్షన్ మార్క్ లేదు.


* స్క్రీన్ ప్లే గజిబిజిగా ఉంటుంది.


* సెకండాఫ్.


* కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అస్సలు ఉండదు.


 


మరొకసారి పూరీ జగన్నాథ్ తీవ్రంగా నిరాశ పరిచాడు, ఆయన తీసిన చెత్త సినిమాలన్నిటిలో కి ఈ సినిమా ఒక ప్రత్యేకం. అందమైన కథ రాసుకున్నాడు కానీ అంతే అందంగా దాన్ని చూపించలేకపోయాడు, ఫస్టాఫ్లో ఏదో చూడబోతున్నాము అనుకుని, ఇంటర్వెల్ కు వచ్చేసరికే ఇదా పూరీ జగన్నాథ్ చెప్పాలనుకున్నది అని తేల్చి పడేస్తారు.  సినిమా నుంచి ఆశించడానికి ఏమీ లేదు, హీరో హీరోయిన్ నటనల కోసం ఒకసారి చూడొచ్చు.


Be the first to comment on mehbooba Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Videos
Load moreవీడియోస్!!!
Latest News