పద్మావత్ | పద్మావత్ Review | Rating | పద్మావత్ News | Release Date | In Theaters | పద్మావత్ Pics | Photos | Images | Wallpapers | పద్మావత్ Direcrtor | Producer | Music | Cast | Technicians :: TollywoodTimes
విడుదల తేది : January 25, 2018, తారాగణం : దీపిక పడుకోనే
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
3.00
Verdict - పద్మావత్ మూవీ రివ్యూ

ఈ చిత్రం విడుదలకు ముందు చాలానే గొడవలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.  ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ లో విడుదల చేద్దామనుకున్నా వివాదాలు కారణంగా నిలిపివేశారు. ఎన్నో షరతులతో ఈ చిత్రాన్ని జనవరి 25వ తేదీన విడుదల చేసినప్పటికీ కొంతమంది చిత్రాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అంతలా సినిమాని ఆపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు...అంతగా సినిమాలో ఏముంది... ఇప్పుడు తెలుసుకుందాం...


 


కథ:


అల్లావుద్దీన్ ఖిల్జి మొండి వాడు, మూర్ఖుడు, ప్రతిదీ తనకే లభించాలి అనే అత్యాశతో ఉండే వ్యక్తి, మోసాలు చేసి రాజ్యాలు దక్కించుకుంటాడు, తనకు కావాల్సిన  దాని కోసం ఎంతకైనా తెగిస్తాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇలాంటి నీచమైన దృష్టి కలిగిన అల్లావుద్దీన్ ఖిల్జి కన్ను అపురూప సౌందర్యవతి అయిన రాణి పద్మావతి పై పడుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ పై పద్మావతి ఏ విధంగా విజయం సాధించింది అన్నదే ఈ కథ సారాంశం.


 


విశ్లేషణ:


సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వ ప్రతిభ ప్రతీ సీన్ లోనూ కనిపిస్తుంది. నటీనటుల వస్త్రాలు దగ్గర్నుంచి వారు నటించే విధానం వరకూ దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.  అది సినిమాలో కనిపిస్తుంది. తన అద్భుతమైన క్రియేటివిటీతో రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని తెర వెనక దాగున్న దర్శకుడు రంజింప చేసాడనే చెప్పాలి.  ఇకపోతే హీరోయిన్ దీపికా పడుకోణె నటన గురించి చెప్పుకోవాలి, చాలా అద్భుతంగా నటించింది ఈ చిత్రంలో దీపిక. రాణి పద్మావతి పాత్రకు సరిగ్గా సరిపోయింది. రణవీర్ సింగ్ నెగెటివ్ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పచ్చు. షాహిద్ కపూర్ తన పాత్రకు న్యాయం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


 


ఈ సినిమాకి సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా మ్యూజిక్ అందించారు, పాటలు పర్వాలేదు అనిపిస్తాయి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.  మధ్యలో కొన్ని చోట్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అయినప్పటికీ, చివరికి మంచి అనుభూతితో ప్రతి ప్రేక్షకుడు బయటకు వస్తాడు.


 


బలం బలహీనతలు


 


ప్లస్ పాయింట్స్ :


 


* సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం


* నటీనటుల నటన


* ఫస్టాఫ్, క్లైమాక్స్


* రణవీర్ సింగ్ నెగెటివ్ రోల్ లో చూపించిన తీరు.


 


నెగెటివ్ పాయింట్స్ :


 


* సెకండాఫ్ స్లో అవుతుంది


* కొన్నిచోట్ల డబ్బింగ్ సరిగ్గా సెట్ అవలేదు.


* క్లైమాక్స్ వరకు ఎమోషన్ ఎక్కడా కనిపించదు.


* ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు.


 


మొత్తానికి ఈ సినిమా కోసం అంతగా ఆరోపణలను, గొడవలను చెయ్యాల్సిన అవసరం అయితే లేదు అనిపిస్తుంది. మన చరిత్ర ఎక్కడినుంచి వచ్చింది అన్నదానిపై దర్శకుడు ఇచ్చిన విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. సతీసహగమనం గురించి, మరి కొన్ని ఆచారాలు గురించి చరిత్ర చెప్పే నిజాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. 


Be the first to comment on padmavat Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!