ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.25
Verdict - సమ్మోహనం
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
3.25
Verdict - సమ్మోహనం రివ్యు : అందం, ఆహ్లాదం కలగలిపిన సమ్మోహం ఈ సమ్మోహనం

నటినటులు : సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి


దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి


నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్


సంగీతం : వివేక్ సాగర్


సినిమాటోగ్రఫర్ : పి.జి.విందా


ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్


స్క్రీన్ ప్లే : మోహన్ కృష్ణ ఇంద్రగంటి


 


సుధీర్ బాబు హీరోగా అదితి హైదరీ రావు హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పేరు సమ్మోహనం. ఈ సినిమా కి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం చేస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్నీ అందించారు. ప్రపంచ వ్యాప్తంగా 'సమ్మోహనం' ఈ రోజు విడుదల అయ్యింది, ఈ సినిమా ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.


 


కథ:


చిన్నపిల్లల కథలకు సంబంధించి బొమ్మలు గీసే విజయ్ (సుధీర్ బాబు)కు మొదటి నుండి సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. సినిమాలంటే తెగ ఇష్టపడే వాళ్ళ నాన్నతో కూడ ఎప్పుడూ విభేదిస్తూనే ఉంటాడు. అలాంటి విజయ్ జీవితంలోకి సమీరా (అదితి రావ్ హైదరి) అనే స్టార్ హీరోయిన్ ప్రవేశిస్తుంది.


 


విజయ్ ఆమెను ప్రేమిస్తాడు. కానీ వాళ్ళ ప్రేమకు మొదట్లోనే అడ్డంకులు ఏర్పడతాయి. విజయ్ సమీరా నుండి దూరంగా వెళ్ళిపోతాడు ఒకానొక దశలో ఆమెను ద్వేషిస్తాడు. అలా దూరమైన ఆ ఇద్దరూ మళ్ళీ ఎలా కలుసుకున్నారు, మొదట్లో ఎందుకు విడిపోయారు, పెద్ద స్టార్ అయిన సమీరా జీవితం ఎలాంటిది అనేదే ఈ సినిమా.


 


విశ్లేషణ : 


మోహన్ కృష్ణ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రాలు చాలా బాగుంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు, దానికి కారణం సినిమా పై ఆయనకి ఉండే ప్రేమ తెర మీద కనిపిస్తుంది, సినిమాను ప్రేక్షకులకి చూపించే విధానం ఆకట్టుకుంటుంది, సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి ఆనందం లభిస్తుంది. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు అన్నీ ఇలాగే ఉంటాయి, వాటిలో 'అష్టా చెమ్మా', 'జెంటిల్ మేన్' ప్రత్యేకం, ఇప్పుడు ఈ జాబితా లోకి 'సమ్మోహనం' కూడా చేరింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో మంచి చిత్రం ఈ 'సమ్మోహనం'. తను కథను నడిపిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది, కథ పరంగా ట్విస్ట్లు, పెద్ద భారీ సీన్లు లేనప్పటికీ కథను కొత్త కోణంలో ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఈ సినిమాకు మొత్తం క్రెడిట్ డైరెక్టర్ కి ఇవ్వడానికి లేదు హీరో సుధీర్ బాబు కూడా బాగా నటించాడు, తన మునుపటి చిత్రాల అన్నిట్లో కంటే  ఈ చిత్రం తన నటనకు మంచి గుర్తింపు లభిస్తుంది. హీరోయిన్ అదితి రావు కూడా తన పాత్రకు తగ్గట్టు బాగానే చేసింది, ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో తను కనబరించిన హావభావాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. 


ఇకపోతే సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నరేష్ గురించి ఈ సినిమాలో హీరో తండ్రి గా నటించిన నరేష్ చాలా చక్కగా చేశారు. సినిమాలో కనిపించిన ప్రతి సారి ప్రేక్షకుడిని నవ్విస్తూనే వుంటారు, ఇంకా చెప్పాలంటే హీరో తర్వాత హీరో అంతటి గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లి పాత్రలో పవిత్ర లోకేష్ గారు కూడా చాలా బాగా చేశారు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తల్లి కొడుకు మధ్య జరిగిన సంభాషణ చాలామంది ని ఆలోచించేలా చేస్తుంది. సినిమా మొదటి బాగం అంతా చాలా తేలిగ్గా కొత్తగా మనసుకు హత్తుకునేలా తీసేశారు, హీరో హీరోయిన్ మధ్య సాగే ప్రేమ కథ తెరమీద చాలా అందంగా ఉంది, కాని రెండో భాగం లోకి వచ్చేసరికి మాత్రం కొంత రొటీన్ ఫార్మాట్ లో కి వెళ్ళారు, అయితే మొదటి పది నిమిషాలు అయ్యాక మళ్ళీ సినిమా ట్రాక్ లొకి వస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి మాత్రం నరేష్ తన నటనతో అందర్నీ చాలా బాగా నవ్విస్తాడు, సినిమా నెమ్మదిగా ఉన్నపుడు నరేష్ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో అలరించాడు.


ఇకపోతే సంగీత దర్శకుడు వివేక్ సాగర్ పాటల వరకు పర్వాలేదు అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేశారు, మధ్యలో కొన్ని సన్నివేశాలలో మరీ బోరింగ్ గా అనిపించిన మళ్లీ బ్యాక్ అయ్యారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఖర్చుకి వెనకాడకుండా చేశారు, చిన్న చిన్న లొకేషన్స్ లో చేసిన సీన్స్ ని కూడా చాలా జాగ్రతగా తీసుకుంటూ వచ్చారు. ఇకపోతే మిగిలిన నటీ నటులు రాహుల్ , అభయ్ వారి పాత్రలకు తగిన విధంగా బాగానే చేశారు.


 


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ :


* కొత్త కథ, మంచి భావోద్వేగాలతో కూడిన కథనం.


* హీరో హీరోయిన్ నటన.


* సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ ప్రత్యేక ఆకర్షణ.


 


మైనస్ పాయింట్స్ :


* సెకండ్ హాఫ్ మొదట్లో నెమ్మదిగా సాగిన తీరు.


* సినిమాలో మాస్ మసాల ఎంటర్టైన్మెంట్ లేకపోవడం.


* ఇంకాస్త భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలను రాస్తే ఇంకా బాగుండేది.


 


 


మొత్తానికి ‘సమ్మోహనం’ చిత్రం సుధీర్ కు మంచి బ్రేక్ గా చేపుకోవచ్చు. సినిమాలో నరేష్ పాత్ర చాలా ప్రత్యేకం, మోహన్ కృష్ణ దర్శకత్వం, ఆయన ప్రేమకథను సరికొత్త కోణంలో చూపించిన విధానం, హీరో హీరోయిన్ల నటన, తగినంత ఫన్, భావోద్వేగానికి గురిచేసే రెండు కీలకమైన సందర్భాలు సినిమాలో మెచ్చుకోదగిన అంశాలు కాగా కన్ఫ్యూజన్ కు గురిచేసే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, కాస్త ఎక్కువైన డ్రామా, సినిమా చాలా వరకు ఒకే స్థాయిలో సాగడం ఇందులో కొద్దిగా నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే అందం, ఆహ్లాదం కలగలిపిన సమ్మోహనంగా ఈ చిత్రం యువతకు, మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.


Be the first to comment on sammohanam Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!
Latest News