విడుదల తేది : February 02, 2018, దర్శకుడు : , తారాగణం :రవి తేజ , రాశిఖన్నా, వంశి వక్కంతం
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
2.50
Verdict - రవితేజ మార్క్ యాక్షన్, తేలిపోయిన దర్శకుడు ప్రతిభ.

టచ్ చేసి చూడు సినిమా పై పూర్తి సమీక్ష : 


నటీనటులు : రవితేజ, సీరాత్ కపూర్, రాశి ఖన్నా.


దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.


నిర్మాత : బుజ్జి.


సంగీతం : ప్రీతమ్.


ఆర్ట్ డైరక్షన్ : రామ్ అరవసాలి.


కెరియర్ మొదటి నుంచే ఎన్నో కష్టాలు తో పైకొచ్చిన హీరో మాస్ మహారాజ్ రవితేజ. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో పైకొచ్చిన హీరోల పేర్లు చెప్పమంటే అందులో మొదటి స్థానంలో ఉంటాడు రవితేజ. కొద్దికాలం క్రితం వరుస ఫ్లాఫ్ లతో ఉన్న రవితేజ కెరియర్ ను మలుపు తిప్పిన సినిమా 'బలుపు', ఆ సినిమా తర్వాత నుంచి రవితేజ పూర్తిగా మాస్ సినిమాలను తీయడం మొదలుపెట్టాడు 'పవర్', 'రాజా ది గ్రేట్' ఇలా వరుసగా హిట్లు కొట్టుకుంటూ మళ్లీ రవితేజ పవర్ ఫుల్ హీరోగా నిలిచాడు. ఈవారం రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' సినిమా విడుదలైంది. ఈ సినిమాకి దర్శకుడు గా విక్రమ్ సిరికొండ. నిర్మాతగా బుజ్జి వ్యవహరించారు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్లుగా రాశి ఖన్నా మరియు సీరాత్ కపూర్ నటించారు. ప్రీతమ్ ఈ సినిమా కి సంగీతం అందించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒక సారి చూద్దాం.


కథ : 


డ్యూటీ అంటే పూర్తి నిబద్ధతతో ఉండే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ హీరో కార్తికేయ, కుటుంబాన్ని  మరియు మిగతా అన్ని విషయాలను కూడా పక్కన పెట్టి  పోలీస్ డ్యూటీ యే అంతిమ కర్తవ్యం గా భావించే వ్యక్తి.  కార్తికేయ కుటుంబం కూడా హీరో కి అడ్డు చెప్పరు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ని ఇష్టపడే ఒక అమ్మాయి (సీరత్ కపూర్). కానీ కొన్ని సంఘటనలు తర్వాత హీరో పూర్తిగా పోలీసు ఉద్యోగం వదిలేసి అక్కడినుంచి తన కుటుంబంతో వేరే ప్రాంతానికి వెళ్లి పోతాడు. 


అక్కడ ప్రశాంతంగా తన కుటుంబంతో ఆనందంగా బతుకుతుంటాడు. పుష్ప(రాశి ఖన్నా) అనే అమ్మాయితో పెళ్లిచూపులు, తర్వాత ఆమెతో ప్రేమ వ్యవహారం సాగుతూ ఉంటుంది. కానీ తన గతం తనని మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది, తను మధ్యలోనే వదిలేసిన ఒక కార్యాన్ని తిరిగి ముగించడానికి మళ్లీ ఖాకీ చొక్కా వేస్తాడు హీరో. అసలు తన గతంలో ఏం జరుగుతుంది. ఎందుకు తను పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి రావాల్సి వచ్చింది..? అనేది మిగిలిన కథ.


విశ్లేషణ : 


భాషా సినిమా నుంచి వస్తున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కథే ఈ సినిమా కూడా, రవితేజ కెరీర్ లో వచ్చిన సినిమాలు 'బలుపు', 'పవర్' ఈ రెండు సినిమాల కలయికే 'టచ్ చేసి చూడు'. మొదటి భాగంలో ఎవ్వరికి తెలియని ప్రశాంతమైన పాత్రలో హీరో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు, సరిగ్గా తన గతం తాలూకు సంఘటనలు మళ్లీ కనిపించడం అక్కడితో విరామం, హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కి వెళ్లడం, తిరిగి తన పాత పాత్రలోకి హీరో వెళ్లడం ఇది రెండో భాగం. సినిమాలో చెప్పుకోదగ్గ విషయమేంటంటే రవితేజ నటన ఈ సినిమాలో రవితేజ నటనకు వందకు వంద మార్కులు పడతాయి. హీరోయిన్లు ఇద్దరూ కూడా పాటల్లో మినహాయించి పెద్దగా కనిపించేది ఉండదు.


దర్శకుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చాలా బాగా రాసుకున్నాడు అంతే బాగా తీశాడు కూడా కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా మొత్తాన్ని నడిపించాలంటే అది చాలా కష్టమైన పని. కొన్ని సీన్స్ లో మాత్రం దర్శకుడి పనితనం బాగా కనిపించింది. హైదరాబాద్ పాతబస్తీ గొడవలు అంటూ పరోక్షంగా ఒక పార్టీని ఉద్దేశించినట్లు కొన్ని సన్నివేశాలు ఉంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదు. తదితరులు వారి పాత్రలకు తగ్గట్టుగా చేశారు. ప్రీతమ్ పాటలు బాగున్నాయి, మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన బలం. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ బాగున్నాయి.


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ :


* రవితేజ నటన.


* మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్.


* ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.


* కొన్ని సన్నివేశాల్లో దర్శకుడి పనితనం బాగుంది.


* రెండో భాగం పతాక సన్నివేశం మినహాయించి.


మైనస్ పాయింట్స్ :


* వక్కంతం వంశీ పాత కథ, విక్రమ్ సిరికొండ పాత కథనం.


* మొదటి భాగం చాలా సాదాసీదాగా ఉండటం.


* క్లైమాక్స్ ముందు వరకూ ఉండే ఉత్కంఠ చివరిలో  కనిపించదు.


* తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి ముందుగానే అర్థమైపోతుంది.


మొత్తానికి 'టచ్ చేసి చూడు' సినిమా ఒక రొటీన్ కమర్షియల్ సినిమా. రవితేజ అభిమానులకు, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటే చాలు అనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహాయించి సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రవితేజ నటన కోసం ఒకసారి చూడొచ్చు.


Be the first to comment on touch chesi chudu Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Videos
Load moreవీడియోస్!!!
Latest News