language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఎగసే తారాజువ్వలు ప్రీ రిలీజ్ వేడుక

  Oct 09, 2017, 15:21 IST
| Views : 19

హెచ్ వై ప్రొడక్షన్స్ పై శ్రీమతి వాని ఇరగం ప్రెసెంట్స్ ఎగసే తారాజువ్వలు చిత్రాన్ని నిర్మాత నాగ మల్లా రెడ్డి నిర్మించగా మహేష్ కత్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యం లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు చిత్ర యూనిట్.

 తారాజువ్వలు చిత్ర వేడుకకు  ముఖ్య అతిథి గా  విచ్చేసిన  విజయ్ దేవరకొండ బిగ్ సిడి ని, మరియు చాలాకి న్యూస్ వెబ్ సైట్ ను లాంచ్ చేయగా  ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ ను అతిథులు శేఖర్ కమ్ముల, తమ్మారెడ్డి భరద్వాజ్, చిన్ని కృష్ణ లు కలసి మధురా ఆడియో ద్వారా విడుదల గావించారు, ఈ చిత్ర  ట్రైలర్  గీతా కృష్ణ, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, శ్రీనివాస్ రాజ్, మధురా శ్రీదర్ లు విడుదల చేసారు.  

అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఇటీవల కాలంలో స్కూళ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సెన్సీటివ్ టాపిక్ ను అటెంప్ట్ చేసిన దర్శక నిర్మాతలకు నా అభినందనలు అని అన్నారు. కమర్షియల్ సినిమాలు చేసి డబ్బు సంపాందించుకోవాలని చూసే వాళ్ళున్న ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ పై కాన్సెప్ట్ ను తీసుకొని సమాజానికి ఉపయోగపడేలా సినిమా చేసిన కత్తి మహేష్ ను, నిర్మాత మల్లారెడ్డి ను అభినందించకుండా ఉండలేం అని అన్నారు. 

ముఖ్య అతిథి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నేను ఇప్పుడు ఈ ప్లేసులో ఉన్నాను అంటే బాగా చదుకోవడమే కారణం. మార్కులు ఇంపార్టెంట్ కాదు నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఏ సమస్యలు వచ్చినా ఎవరికివారే ధైర్యంగా  పరిష్కరించుకునేలా పిల్లలు ఎదగాలని కోరుతున్నా అని చెబుతూ ఈ చిత్రం లో నటించిన చైల్డ్ అర్టిస్ట్స్ కు మేసెజ్ తో కూడిన కార్డ్స్ ను, పెన్స్ ను అందించారు.  దర్శకుడు మహేష్ కత్తి మాట్లాడుతూ చదువంటే బట్టి పట్టడం కాదు జీవితాన్ని వడేసి పట్టడం అనే అంశాన్ని ఎంటర్టైనింగ్ గా, సెన్సిటివ్ గా ఈ చిత్రంలో చెప్పడం జరిగింది. 

సినిమా చూసిన ప్రతిఒక్కరినీ నిరుత్సాహ పరచదు అని మాత్రం నమ్మకంగా చెప్పగలను అని అన్నారు. చాలా కష్టపడి సినిమా చేసాము. ఈ చిత్రానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అని తెలిపారు నిర్మాత నాగ మల్లా రెడ్డి.ఈ కార్యక్రమానానికి అవసరాల శ్రీనివాస్, క్రాంతి మాధవ్,  సంగీత దర్శకుడు రఘు కుంచె, లక్ష్మీ భూపాల్, సతీష్, అజయ్ ఘోష్, మరియు ఈ చిత్ర యూనిట్,  పాల్గొని తమ అభిప్రాయాలను, అభినందనలు తెలియచేసారు.

యశ్వంత్, హాసిని, సౌమ్య వేణుగోపాల్, అజయ్ గోష్, లోహిత్, స్వప్న , అప్పాజీ అంబారిష్ఠ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు: మహేష్ కత్తి, నిర్మాత: నాగ మల్లారెడ్డి, కో డైరెక్టర్: కార్తిక్ మెడికొండ, కెమెరా: వినోద్, రాజేంద్ర, మ్యూజిక్: గంటశాల విశ్వనాధ్,  కాస్ట్యూమ్స్: నిహారిక, లిరిక్స్: భాస్కరభట్ల, శ్రేష్ఠ, ఎడిటర్: రవితేజ, రఘు.

Related News
Oct 10, 2017, 11:12 IST
Oct 05, 2017, 12:26 IST
Sep 17, 2017, 13:04 IST
Sep 06, 2017, 17:10 IST
Sep 05, 2017, 10:02 IST
Aug 29, 2017, 22:48 IST
Related Photos
Oct 10, 2017, 11:25 IST
Oct 09, 2017, 13:04 IST
Oct 05, 2017, 10:51 IST
Related Videos
Aug 28, 2017, 19:18 IST
Aug 06, 2017, 11:17 IST
Jul 17, 2017, 17:06 IST
 
Recommended
Recommended
Latest Albums