language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఉగాది పర్వదినాన ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మాస్ మహారాజా రవితేజ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

  Mar 13, 2018, 18:49 IST
| Views : 168

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా  రామ్ తాళ్లూరి గారు నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌ని తెలుగువారి మొదటి పండుగ ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు.

రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు.  ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

Related News
Jul 01, 2018, 14:31 IST
Jun 13, 2018, 12:08 IST
May 25, 2018, 11:25 IST
May 22, 2018, 18:36 IST
May 21, 2018, 14:33 IST
May 19, 2018, 15:35 IST
Related Photos
May 12, 2018, 11:51 IST
Dec 09, 2017, 18:31 IST
Nov 19, 2017, 21:41 IST
Related Videos
May 16, 2018, 19:17 IST
Jan 27, 2018, 23:24 IST
Jan 25, 2018, 23:00 IST
 
Recommended
Recommended
Latest Albums