language
Home >> News
Dedicated Servers from Liquid Web

అందరూ ఊహించినట్టే జరిగిందా..?? ఈ మెగా వారసుడు పక్కా ప్లాన్ తో వచ్చాడు.

By : Vijay |
  Feb 13, 2018, 19:00 IST
| Views : 65

అందరూ ఊహించినట్టుగానే ఈ వారం బాక్స్ ఆఫీస్ ఫలితాలు కనబడుతున్నాయి. వరుణ్ తేజ్ నటించిన 'తొలిప్రేమ' చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎక్కువగా ఆదరణ లభిస్తుందని ముందుగానే ట్రేడ్ విశ్లేషకులు భావించారు, ఇప్పుడు అదే జరుగుతుంది.


మొదటి ప్రేమ వ్యవహారంపై ఈ సినిమా తెరకెక్కింది. ఫస్టాఫ్ అంతా కూడా స్టూడెంట్స్ కి, యువత కి, ప్రేమికులకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉండడంతో ఈ సినిమాకి యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే సెకండాఫ్ కూడా ఒకప్పటి ప్రేమికులు వారివారి ప్రేమను తలచుకునే వ్యవహారం ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి ప్రేమ సన్నివేశాలను ఈ సినిమా కోసం సృష్టించారు అవన్నీ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. వరుణ్ తేజ నటనకి కూడా అంతే స్థాయిలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. తమన్ మ్యూజిక్ కి థియేటర్లో చప్పట్లు పడుతున్నాయి. మొత్తానికి మంచి విజయం వైపు దూసుకు పోతుంది  'తొలి ప్రేమ' సినిమా.


సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 5 కోట్ల 20 లక్షల షేరు ను కలెక్ట్ చేసింది. వరుణ్ తేజ్ కెరీర్లోనే ఇవే అత్యుత్తమ ఓపెనింగ్స్. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రెండోరోజు కూడా సినిమా 4 కోట్ల 50 లక్షల వరకూ షేరును రాబట్టగలిగింది. రెండు రోజుల్లో తొలిప్రేమ సినిమా 9 కోట్ల 70 లక్షలు పైగా షేర్ వసూలు చేసింది. అమెరికాలో రెండు రోజులకే ఆఫ్ మిలియన్ మార్కును దాటేసింది. ప్రస్తుతం ప్రేమికుల సీజన్ నడుస్తుండడంతో తొలిప్రేమ కు మరింత కలిసొస్తుంది.

Related News
No News Found
Related Photos
No Photos Found
Related Videos
No Videos Found
 
Recommended
Recommended
Latest Albums