language
Home >> News
Dedicated Servers from Liquid Web

వీరాభిమాని మరణంతో విషాదంలో బాలయ్య

  Apr 21, 2017, 14:37 IST
| Views : 86

స్టార్ హీరో అన్న ఒక్క మాటని జీవితకాలం నిలబెట్టేది కేవలం అభిమానం మాత్రమే. ఇండస్ట్రీలో  ప్రతీ నటుడికి అభిమానులు వుంటారు. ఆ అభిమానం వల్లే మన హీరోలు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితాల్లో కూడా హీరోలుగా మారుతున్నారు. అలాంటి ఒక వీరాభిమాని దూరమైతే ఎంత పెద్ద స్టార్ కి అయిన తీరని లోటు. ప్రస్తుతం ఆలోటును మన నటసింహం బాలకృష్ణ అనుభవిస్తున్నాడు.

నంద్యాలలోని నూనెపల్లి వీధికి చెందిన 'కాశిం' అనే వ్యక్తి బాలయ్య బాబుకు వీరాభిమాని. స్వర్గీయ రామారావు గారి కాలం నుండి నందమూరి కుటుంబానికి సన్నిహితుడైన కాశిమ్(53)  బాలకృష్ణ ఫాన్స్ అధ్యక్షుడిగా సేవలందించారు.

బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించిన ఈయన బాలయ్య పుట్టినరోజున ఎన్నో సేవా కార్యక్రామాలు నిర్వహించేవారు. ఆ కార్యక్రమాల్లో 75 సార్లు రక్తదానం చేసి రికార్డులు సృష్టించాడు కూడా. ఇలాంటి ఒక అభిమానిని కోల్పోవడంతో బాలకృష్ణ విషాదంలో కూరుకుపోయారు.    

Related News
Oct 17, 2017, 11:12 IST
Oct 12, 2017, 15:40 IST
Sep 25, 2017, 19:04 IST
Sep 11, 2017, 21:46 IST
Aug 28, 2017, 18:33 IST
Aug 25, 2017, 10:15 IST
Related Photos
Sep 05, 2017, 09:49 IST
Aug 28, 2017, 18:58 IST
Aug 18, 2017, 10:57 IST
Related Videos
Aug 23, 2017, 14:42 IST
Aug 18, 2017, 17:31 IST
Aug 18, 2017, 11:14 IST
 
Recommended
Recommended
Latest Albums