language
Home >> News
Dedicated Servers from Liquid Web

'అందమైన జీవితం' అక్టోబర్ 13 న విడుదల

  Oct 11, 2017, 11:47 IST
| Views : 134

మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై, దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన,  అభిరుచి గల నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం 'అందమైన జీవితం'. సత్యన్ అంతిక్కాడ్ ఈ చిత్రానికి దర్శకుడు. అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ..'ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. 

తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని, ప్రేమికుల మధ్య వుండే ప్రేమని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమే అందమైన జీవితం. సంగీతానికి మంచి ఇంపార్టెన్స్ వున్న మ్యూజికల్ హిట్ చిత్రమిది. మలయాళంలో ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లో నిలిచింది. అక్టోబర్ 13న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము.. అని అన్నారు.దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, మాటలు: ఘంటసాల రత్నకుమార్, ఎడిటింగ్: ఈ. ఎమ్. నాగేశ్వరరావు, ఫోటోగ్రఫీ: ఎస్. కుమార్, పాటలు: శ్రీరామమూర్తి, సమర్పణ: పత్తిపాటి శైలజ, నిర్మాత: పత్తిపాటి శ్రీనివాసరావు, దర్శకత్వం: సత్యన్ అంతిక్కాడ్.

Related News
Jul 11, 2018, 17:06 IST
Jul 11, 2018, 15:53 IST
Jul 07, 2018, 18:50 IST
Jul 04, 2018, 14:26 IST
Jul 02, 2018, 22:43 IST
Jul 01, 2018, 19:21 IST
Related Photos
Oct 18, 2017, 16:19 IST
Oct 15, 2017, 15:15 IST
Oct 07, 2017, 16:52 IST
Related Videos
May 28, 2018, 14:53 IST
Nov 11, 2017, 19:30 IST
Oct 17, 2017, 18:07 IST
 
Recommended
Recommended
Latest Albums