language
Home >> News
Dedicated Servers from Liquid Web

దిగివచ్చిన కట్టప్ప... లేఖ ద్వారా కన్నడ ప్రజలకు క్షమాపణ

  Apr 21, 2017, 16:30 IST
| Views : 95

ఇంకొక వారంలో సరిగ్గా ఏప్రియల్ 28 'బాహుబలి 2' రిలీజ్ అని ప్రపంచమంతా ఆతృతగా ఉంటే కర్ణాటకలో మాత్రం దీనికి విరుద్ధంగా బాహుబలి 2 రిలీజ్ ని ఆపాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించిన తమిళ నటుడు సత్యరాజ్ కర్ణాటక జలాల గురుంచి చేసిన వ్యాఖ్యలేనని ఆయన సినిమాలు కర్ణాటకలో ప్రదర్శించనివ్వమని పట్టుపట్టుకుని కూర్చున్నారు కన్నడిగులు.

వాస్తవానికి సత్యరాజ్ 9 సంవత్సరాల క్రితం అన్నమాటలకి కర్ణాటక ప్రజలు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారో తెలియక ముందు తేలికగా తీసుకున్న బాహుబలి టీమ్ సమయం దగ్గరపడేసరికి ఆందోళనలో పడ్డారు. దానికి తోడు సత్యరాజ్ బహిరంగ క్షమాపణ కోరకపోతే ఏప్రియల్ 28న కర్ణాటక బంద్ కూడా ప్రకటించడంతో దర్శకుడు రాజమౌళి కర్ణాటక ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు.

అయినా ఎటువంటి స్పందన లేకపోవడంతో స్వయంగా నటుడు సత్యరాజ్ తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని, దయచేసి 'బాహుబలి 2' విడుదల ఆపొద్దని స్వయంగా కన్నడ భాషలో రాసిన క్షమాపణ లేఖ చదివి వినిపించాడు. ఇప్పుడైనా కన్నడ ప్రజలు శాంతించి 'బాహుబలి 2' విడుదలని సక్రమంగా జరిగేలా చేస్తారో లేదో చూడాలి.

Related News
May 24, 2017, 13:06 IST
May 07, 2017, 10:54 IST
May 04, 2017, 18:01 IST
May 03, 2017, 14:11 IST
Oct 24, 2016, 17:52 IST
Jul 02, 2016, 14:15 IST
Related Photos
May 19, 2017, 14:47 IST
Apr 18, 2017, 10:01 IST
Apr 17, 2017, 15:16 IST
Related Videos
May 19, 2017, 10:35 IST
Jan 17, 2017, 15:41 IST
Sep 29, 2016, 12:23 IST
 
Recommended
Recommended
Latest Albums