language
Home >> News
Dedicated Servers from Liquid Web

అవకాశం ఉన్న లేకపోయినా ఒకటే రేటు...

  May 19, 2017, 18:06 IST
| Views : 122

గతం లో రెమ్యూనరేషన్ అనేది అవకాశాలు ఉన్నప్పుడు ఒకలా లేనపుడు ఒకలా ఉండటం ఆనవాయితీగా ఉండేది. ఫామ్ లో లేనపుడు రెమ్యూనరేషన్ లో రాయితీ ఇచ్చి మంచి అవకాశాలను చేజిక్కించుకుని తిరిగి ఫామ్ లోకి వచ్చాక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారు. స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ల విషియం లో జరుగుతూ వస్తుంది. 

ఇప్పుడు మాత్రం సినిమా అవకాశాలు ఉన్న లేకపోయినా రెమ్యూనరేషన్ లో మాత్రం తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు ఈ ముగ్గురు భామలు. సైజు జీరో తర్వాత అనుష్క సైజు భారీగా పెరగడంతో గ్లామర్ కేరక్టర్ వస్తాయనే నమ్మకం కూడా లేదు. బాహుబలి తర్వాత అనుష్క చేతిలో 'భాగమాతి' ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఆయన సరే తన పారితోషక విషియం లో ఏ మాత్రం తగ్గనంటుంది ఈ దేవసేన... 

ఇక ఖైది నెం 150 తర్వాత కాజల్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రానా హీరోగా తేజ దర్శకత్వం లో నిర్మిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తప్ప ఈ అమ్మడికి మరో అవకాశం లేదు. అయినా ఈ అమ్మడు రెమ్యూనరేషన్ జోరు మాత్రం తగ్గలేదు. మరో హీరోయిన్ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమ్మన్న అటు హీరోయిన్ గా, ఇటు ఐటమ్ పాప బాగానే వసులు చేస్తుంది. బాహుబలి 2 లో సక్సెస్ సాధించకపోయినా గతం లో కంటే ఎక్కువే డిమాండ్ చేస్తుందట తమన్నా. నిజానికి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్లకు రెమ్యూనరేషన్ అందం అనుకుంట...

Related News
Dec 04, 2017, 11:05 IST
Dec 04, 2017, 10:51 IST
Nov 28, 2017, 13:33 IST
Nov 18, 2017, 12:22 IST
Nov 07, 2017, 11:46 IST
Nov 05, 2017, 15:22 IST
Related Photos
Nov 06, 2017, 19:36 IST
Oct 23, 2017, 09:37 IST
Oct 07, 2017, 16:44 IST
Related Videos
Nov 07, 2017, 14:21 IST
Oct 17, 2017, 18:42 IST
Oct 03, 2017, 16:49 IST
 
Recommended
Recommended
Latest Albums