language
Home >> News
Dedicated Servers from Liquid Web

చైతూ సినిమాలో పల్లెటూరి పిల్లగా 'రకుల్'

  Mar 20, 2017, 14:49 IST
| Views : 187

తెలుగు సినీపరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ వరస విజయాలతో ముందుకెళ్తున్న గ్లామర్ డాల్ 'రకుల్ ప్రీత్ సింగ్' చైతు సినిమాలో పల్లెటూరి పిల్ల గెట్ అప్ లో కనిపించనుంది. 'వెంకటాద్రి ఎక్సప్రెస్' సినిమా ద్వారా కుర్ర కారుని ఉర్రూతలూగిస్తున్న రకుల్ ఇప్పటివరకు పోష్, గ్లామరస్ రోల్స్ చేసి మనల్ని మెప్పించింది.

ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నటసామ్రాట్ అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న నాగచైతన్య సినిమాలో విభిన్నంగా కనపడనుందట. 'సోగ్గాడే చిన్ని నాయనా' ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్యపాత్ర పోషించనున్నారు.

Related News
Nov 26, 2017, 11:50 IST
Nov 25, 2017, 21:09 IST
Nov 23, 2017, 12:24 IST
Nov 08, 2017, 23:48 IST
Nov 08, 2017, 15:27 IST
Nov 07, 2017, 16:21 IST
Related Photos
Nov 29, 2017, 18:49 IST
Nov 22, 2017, 16:23 IST
Nov 19, 2017, 14:27 IST
Related Videos
Nov 26, 2017, 10:21 IST
Nov 26, 2017, 10:19 IST
Nov 26, 2017, 10:16 IST
 
Recommended
Recommended
Latest Albums