language
Home >> News
Dedicated Servers from Liquid Web

సాయిధరమ్ తేజ్ కెరీర్లో గుర్తుండిపోయే మరో సినిమా..??

By : Vijay |
  Feb 13, 2018, 18:59 IST
| Views : 69

సాయి ధరమ్ తేజ్ మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశాడు. చిరంజీవి పోలికలతో ఉండే ఈ కుర్రాడ్ని చూసిన వెంటనే అభిమానుల్లో ఒక తెలియని ఆనందం నెలకొంది. కానీ మొదటి సినిమా 'రేయ్' విడుదల విషయంలో సాయి ధరమ్ తేజ్ చాలా కష్టాలే ఎదుర్కొన్నాడు, కాని చివరికి ఆ సినిమా విడుదల కాక తన రెండో సినిమా 'పిల్లా నువ్వులేని జీవితం' పూర్తి చేసుకుని విడుదల అయిన తర్వాత తన మొదటి సినిమా ధియేటర్ లోకి వచ్చింది. 'రేయ్' సినిమా పై అప్పట్లో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి, కానీ ఈ సినిమా విడుదలయ్యాక తీవ్ర నిరాశకు గురయ్యారు అభిమానులు. ఈ సినిమా పై 20 కోట్లకుపైగా అప్పట్లో ప్రీ బిజినెస్ జరిగింది. కానీ సినిమా మొత్తానికి 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు రాబట్టగలిగింది అంతే. డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.


తన కెరియర్ లో ఇలాంటి సినిమాలు మళ్ళీ ఉండబోవని సాయి ధరమ్ తేజ్ అప్పట్లో అభిమానులకు హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే, కానీ 'రేయ్' సినిమా కన్నా దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు 'ఇంటిలిజెంట్' సినిమా ఉంది. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఇంటిలిజెంట్' ఇప్పుడు 'రేయ్' సినిమా నష్టాలను బ్రేక్ చేసేలా ఉంది. ఈ సినిమాని మామూలు ప్రేక్షకులే కాదు ఫ్యాన్స్ కూడా చూసే పరిస్థితి లేదు, అంత పేలవంగా ఉంది సినిమా. ఒకప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమా అంటే తొలిరోజున కనీసం 5-6 కోట్లు షేర్ లభిస్తుందని ఆశించేవారు నిర్మాతలు కానీ వరుస పరాజయాలతో ఆ మార్కు పోగొట్టుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ని పక్కన పెట్టినా వీవీ వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా కేవలం రెండు కోట్ల షేర్ మాత్రమే రావటం, ఈ సినిమా ఎంత దారుణంగా ప్రేక్షకులను నిరాశపరిచిందో చెప్పడానికి నిదర్శనం. చివరికి ఆదివారం కూడా ఈ సినిమాకి ప్రేక్షకులు కరువయ్యారు. చాలావరకు థియేటర్లలో టికెట్ కౌంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సినిమా థియేట్రికల్ బిజినెస్ 25కోట్లు గా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు 6 కోట్ల షేర్ కూడా వచ్చే పరిస్థితిలో లేదు. అంతటి దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది ఈ చిత్రం.


నష్టాల్లో 'రేయ్' సినిమాను అదే సాయి ధరమ్ తేజ్ సినిమా 'ఇంటిలిజెంట్' క్రాస్ చేసేలా కనిపిస్తుంది. ఇకనైనా సాయి ధరమ్ తేజ్ మారి కథకు, నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రల్లో నటిస్తాడని ఆశిద్దాం.

Related News
No News Found
Related Photos
No Photos Found
Related Videos
No Videos Found
 
Recommended
Recommended
Latest Albums