language
Home >> News
Dedicated Servers from Liquid Web

అజ్ఞాతవాసి ప్లాన్-బి.....

By : Vijay |
  Jan 11, 2018, 23:05 IST
| Views : 242

ఎన్నో భారీ అంచనాలతో విడుదల అయిన 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అత్యంత భారీ బడ్జెట్ తో విడుదలయిన ఈ సినిమా అభిమానులకు సైతం నిరాశను మిగిల్చింది. అసలు ఇది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాయేనా అని బాధతో ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత్ర తీర్చి దిద్దడంలోనే త్రివిక్రమ్ తప్పులు చేసుకుంటూ పోయాడని అందరూ విమర్శిస్తున్నారు.


ఈ విమర్శల సంగతి పక్కన పెడితే 'అజ్ఞాతవాసి' కి భారీ కలెక్షన్స్ వచ్చాయి. యూఎస్ లో అయితే ప్రీమియర్ షో వసూళ్లలో 'బాహుబలి 2'  తర్వాత స్థానంలో 'అజ్ఞాతవాసి' సినిమా నిలబడింది. కానీ ఈ సినిమాకు వచ్చే నెగిటివ్ టాక్ వలన ఎంతవరకు ఈ సినిమా వసూళ్లను రాబడుతుంది అనేది వేచి చూడాల్సిందే.


ఇదిలావుంటే ఈ సినిమాలో బొమన్ ఇరానీ పాత్రని చాలా తెలివైన ఒక వ్యాపార వ్యక్తిగా చూపిస్తాడు, ఒకేసారి రెండు వ్యూహాలను సిద్ధం చేసుకుని ఒక వ్యూహం దెబ్బతింటే వెంటనే మరో వ్యూహం అమలు చేస్తాడు. ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రంలో కూడా అదే జరిగేలా కనిపిస్తుంది, అజ్ఞాతవాసి ప్లాన్ ఏ ఫెయిలవడంతో ఇప్పుడు ప్లాన్-బి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి రెండో వారం నుంచి వెంకటేష్ నటించిన కొన్ని సన్నివేశాలను తిరిగి సినిమాలో పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్లాన్ ఏ బెడిసికొట్టడంతో త్రివిక్రమ్ ప్లాన్-బి ని ప్రవేశపెడుతున్నారు అని సమాచారం.

Related News
Jun 29, 2018, 20:55 IST
Jun 24, 2018, 19:43 IST
Jun 24, 2018, 19:44 IST
Jun 24, 2018, 19:44 IST
Jun 17, 2018, 12:32 IST
Jun 16, 2018, 22:08 IST
Related Photos
May 17, 2018, 01:05 IST
Nov 27, 2017, 15:12 IST
Nov 27, 2017, 15:09 IST
Related Videos
Jun 29, 2018, 21:10 IST
Mar 05, 2018, 18:03 IST
Jan 15, 2018, 21:59 IST
 
Recommended
Recommended
Latest Albums