language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఎట్టకేలకు 7వ తేదీన ఫిక్స్ అయిన మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

  Jan 03, 2017, 15:19 IST
| Views : 81

మెగా స్టార్ 150 వ సినిమా 'ఖైదీ నెం.150' రోజు రోజు కి అభిమానుల్లో ఉత్సహాన్ని పెంచుతుంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా ఆడియో విని అభిమానులు సినిమాకోసం ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఐతే రిలీజ్ కి ముందు అభిమానులను ఉత్సాహపరచడానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 4 న భారీ ఎత్తున విజయవాడలో చేయడానికి నెల ముందు నుండి ప్లాన్ చేస్తున్నారు.

కానీ ఈలోగా విజయవాడ అధికారులు హైకోర్ట్ ఉత్తర్వులతో ఈవెంట్ కి పర్మిషన్ లేదు అనడంతో నిరుత్సాహపడిన నిర్వాహకులు, అభిమానులు నిరసనలను తెలపడంతో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ, గుంటూరు మధ్యలో హాయ్ లాండ్ ను ఫైనల్ చేశారు.

జనవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి ఈ వేడుక మొదలుకానుంది. మెగా హీరోలందరూ ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎట్టకేలకు ఈవెంట్ జరిగేలా చేస్తున్నారు అభిమానులు. మెగా అభిమానులా మజాకా.......
Related News
Mar 20, 2017, 17:39 IST
Mar 20, 2017, 15:53 IST
Mar 18, 2017, 16:02 IST
Mar 17, 2017, 18:19 IST
Mar 16, 2017, 17:20 IST
Mar 16, 2017, 16:45 IST
Related Photos
Mar 20, 2017, 14:39 IST
Mar 02, 2017, 07:52 IST
Mar 01, 2017, 09:39 IST
Related Videos
Mar 09, 2017, 11:29 IST
Feb 21, 2017, 21:07 IST
Feb 21, 2017, 20:41 IST
 
Latest News
Most Viewed
Recommended
Recommended
Latest Albums