language
Home >> News
Dedicated Servers from Liquid Web

సంచ‌ల‌నం సృష్టిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ‌య్య ప‌బ్లిసిటీ

  Jan 02, 2017, 17:02 IST
| Views : 27

ప్ర‌ముఖ నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు తొలి సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమా వ్యాపార వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న ఈ సినిమా చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా, బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ప్ప‌టికీ ఎలాంటి బెరుకు లేకుండా  ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్నారు..తాము గ‌తంలో విడుద‌ల చేసిన బిచ్చగాడు సినిమా త‌ర‌హాలోనే ప‌బ్లి సిటీ ప‌రంగా ..ఆ త‌ర‌హానే వ్యూహాన్నే అనుస‌రిస్తున్నారు..ఈ సినిమా కు సంబందించి ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో జ‌న‌వ‌రి ఒక‌టి న రెండు ఫుల్ పేజీల యాడ్స్ ఇచ్చి సంచ‌ల‌నం సృష్టించారు..ఇలా రెండు యాడ్స్ ఒకే రోజు రావ‌డంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో దీన్ని ఒక సంచ‌ల‌నంగా చెప్పు కుంటున్నారు.

దీనికంత‌టికి సినిమా బాగా రావ‌డ‌మే కార‌ణం .. సినిమా మీద ద‌ర్శ‌కుడికి ఉన్న న‌మ్మ‌కంతో .. త‌మ‌దైన వ్యూహంతో ప‌బ్లిసిటీని ప్లాన్ చేసుకున్నారు..

ఈ సినిమా పూర్వాప‌రాల్లోకి వెళితే ఈ సినిమా చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు తీయ‌డానికి కార‌ణం రామోజీ రావు అని ప‌లు సంద‌ర్భాల్లో చ‌ద‌ల‌వాడ సోద‌రులు చెప్పిన విష‌యం విదిత‌మే .. ఈ సినిమా ప్రారంభం రోజున రామోజీరావు హాజ‌రై కొబ్బ‌రికాయ కొట్టారు.. రామోజీ రావు త‌న కెరియ‌ర్ లో మొట్ట మొద‌టి సారి కొబ్బ‌రి కాయ కొట్టిన సినిమా ఇదే ... అని రామోజీ రావు కాంపౌండ్ వారు చెప్పుకుంటున్నారు.. గ‌తంలో రామోజీ రావు బ్లాక్ మ‌నీని ఎలా అరిక‌ట్టాలి అనే అంశం మీద ఏర్పాటు చేసిన ఓ స‌ద‌స్సుకు హాజ‌రైన చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు గారు ఈ క‌థ‌ను స్వంయంగా రాసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోనే ఈ సినిమా షూటింగ్ జ‌ర‌గింది కూడా ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ సినిమా వెనుక రామోజీ రావు కూడా ఉన్నాడా అనే అనుమానం కూడా రాక మాన‌దు.

ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే  ఏ ఉద్దేశ్యంతో ఏ క‌థాంశంతో సినిమా తీస్తున్నారో .. అది షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే మోడీ ప్ర‌కటించ‌డం వెనుక కూడా కొత్త కొత్త అనుమానాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. ఈ సినిమా వ్యూహాత్మ‌కంగా తీశారా అనే ఆలోచ‌న కూడా రాక‌మాన‌దు...

ప్ర‌స్తుతం ఆర్థిక వ్య‌వ‌స్థ అత‌లా కుతం అవుతున్న స‌మ‌యంలో నిర్మాత ఖ‌ర్చుకు ఏమాత్రం వెనుకాడ‌కుండా ప‌బ్లిసిటీ చేస్తు సినిమాను పెద్ద సినిమాల మీద  విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీనికంత‌టికీ కార‌ణం నిర్మాత‌కు తాను రాసుకున్న క‌థ‌మీద ఉన్న‌న‌మ్మ‌క‌మే అని తెలుస్తోంది..సినిమా బ‌డ్జెట్ ప‌రంగా కూడా ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి కెరియ‌ర్ లో ఇది పెద్ద బ‌డ్జెట్ సినిమా అవుతుంది. సినిమా ఆడ‌టానికి ఎన్నో సానుకూల అంశాలు ఈ సినిమా ప‌రంగా క‌న‌ప‌డుతున్నాయి ..దానితో పాటు గ‌తంలో తాము విడుద‌ల చేసిన బిచ్చ‌గాడు సినిమా అదృష్టం ...ఈ సినిమాకు కూడా ప‌డుతుంద‌ని సినిమా వ‌ర్గాల వారు చెప్పుకుంటున్నారు.

Related News
Jan 20, 2017, 10:34 IST
Jan 17, 2017, 11:38 IST
Jan 12, 2017, 21:02 IST
Jan 10, 2017, 10:36 IST
Jan 09, 2017, 11:40 IST
Jan 07, 2017, 11:19 IST
Related Photos
Jan 17, 2017, 18:42 IST
Jan 10, 2017, 10:58 IST
Jan 10, 2017, 10:36 IST
Related Videos
Jan 23, 2017, 16:22 IST
Jan 23, 2017, 16:10 IST
Jan 21, 2017, 11:51 IST
 
Latest News
Most Viewed
Latest Albums