language
Home >> News
Dedicated Servers from Liquid Web

మార్చి 23న గులేబకావళి

  Mar 13, 2018, 18:40 IST
| Views : 76

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెల 23న తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ   తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు నేటివిటికి దగ్గరగా వుంటుంది. యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన  ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. ఇండియాన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన హైలైట్‌గా వుంటుంది అని తెలిపారు. ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్వకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్. 

Related News
Apr 10, 2018, 10:19 IST
Apr 08, 2018, 18:54 IST
Mar 20, 2018, 17:47 IST
Mar 15, 2018, 17:23 IST
Jul 31, 2017, 19:20 IST
Jul 22, 2017, 12:08 IST
Related Photos
Jul 17, 2017, 11:15 IST
Jun 21, 2017, 14:32 IST
Apr 11, 2017, 09:47 IST
Related Videos
Jul 17, 2017, 12:48 IST
Jul 17, 2017, 12:46 IST
Jul 17, 2017, 10:42 IST
 
Recommended
Recommended
Latest Albums