language
Home >> News
Dedicated Servers from Liquid Web

కామెడీ జోనరే సునీల్ సక్సెస్ మంత్రం

  Mar 20, 2017, 17:43 IST
| Views : 142

సునీల్ కమెడియన్ గా వున్నప్పుడు, సినిమాలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా హిట్ కొట్టేది. అలాంటి సునీల్ ఒక్కడుగు ముందుకు వేసి సిక్స్ ప్యాక్ బాడీ తెచ్చుకుని హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఒకటి రెండు సినిమాలు సునీల్ కి విజయాన్ని తెచ్చిపెట్టినా ఆ తరవాత హీరోగా సునీల్ కు ఆశించిన విజయాలు మాత్రం దక్కట్లేదు.

దానితో సునీల్ తిరిగి తన కామెడీ జోనర్ ని ఎంచుకుని 'ఉంగరాల రాంబాబు' సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు రోజుల క్రితం షూటింగ్ పూర్తిచేసుకుని వేసవి సెలవులకు సందడి చేయనున్నాడు.

థియేటర్స్ లో వచ్చిన ప్రేక్షకులని నవ్వించడమే ద్యేయంగా తెరకెక్కిన ఈ సినిమాలో సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరితో పాటుగా ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, అలీ, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు.

Related News
Oct 07, 2017, 16:02 IST
Oct 06, 2017, 17:36 IST
Oct 05, 2017, 10:45 IST
Sep 28, 2017, 17:20 IST
Sep 28, 2017, 22:14 IST
Sep 26, 2017, 16:50 IST
Related Photos
Sep 26, 2017, 11:09 IST
Sep 23, 2017, 12:49 IST
Sep 21, 2017, 11:17 IST
Related Videos
Sep 12, 2017, 12:43 IST
 
Recommended
Recommended
Latest Albums