language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఒక సెన్సేషనల్ డైరెక్టర్ నుండి ఇలాంటి ట్విట్ట్ మెగా ఫ్యాన్స్ ఏమాత్రం ఊహించి ఉండరు

By : Vijay |
  Feb 14, 2018, 18:25 IST
| Views : 79

మొన్నటి వరకు 'జి.ఎస్.టి' వెబ్ సిరీస్ మీద వార్తా చానల్ లో హల్చల్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ తేజ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ట్విట్ పెట్టాడు. రామ్ చరణ్ తేజ్ నటించిన 'రంగస్థలం' సినిమా టీజర్ అద్భుతంగా ఉంది అంటూ ఇప్పుడు రిలీజ్ అయిన పాట మరింత అద్భుతంగా ఉంది అని తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.  ఈ పాట తో సినిమా రేంజ్ మరింత పెరిగింది అని అన్నాడు వర్మ. అంతేకాదు సినిమాకి విషెస్ చెప్తూ సుకుమార్ కి అభినందనలు కూడా చెప్పాడు. ఇంకా చంద్రబోస్ సాహిత్యం, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతంగా కుదిరాయని సినిమాని ఆకాశానికి ఎత్తేశాడు రామ్ గోపాల్ వర్మ.



మెగా ఫ్యామిలీ మీద రామ్ గోపాల్ వర్మ ఇలా పాజిటివ్ గా ట్విట్ట్ చెయ్యడం మెగా ఫ్యాన్స్ అసలు ఊహించి ఉండరు. వర్మ చేసిన ట్వీట్ మనస్ఫూర్తిగానే చేసినట్టు కనిపిస్తున్నా ఆయన్ని నమ్మడానికి లేదు అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ఎందుకంటే ఏ విషయం గురించి అయినా సరే ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పడం అందరికీ తెలిసిన విషయమే.



ఇంతకుముందు ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఆయన చాలానే వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని అంటూనే ఆయన్ని చాలా డ్యామెజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంత పాజిటివ్ గా రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయడం వెనుక ఏదో ఉంది అని, వర్మని నమ్మడానికి లేదు అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.  కొంత మంది మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ కాలములో కనిపించని జోనర్ కావడంతో.... సినిమాలో విషయం ఉంది కాబట్టే వర్మ హార్ట్ పుల్ గానే ట్విట్ చేశాడని అంటున్నారు.

Related News
Feb 18, 2018, 15:13 IST
Feb 18, 2018, 14:53 IST
Feb 15, 2018, 20:32 IST
Feb 12, 2018, 20:07 IST
Feb 10, 2018, 21:15 IST
Feb 10, 2018, 17:23 IST
Related Photos
Dec 09, 2017, 18:07 IST
Dec 08, 2017, 10:20 IST
Nov 29, 2017, 18:38 IST
Related Videos
Feb 14, 2018, 20:21 IST
 
Recommended
Recommended
Latest Albums