language
Home >> News
Dedicated Servers from Liquid Web

వెంకీకి జోడీగా మళ్లీ ఆ హీరోయినే?

By : Vijay |
  Feb 14, 2018, 18:23 IST
| Views : 193

సీనియర్ హీరో లకి హీరోయిన్స్ దొరకడం మన టాలీవుడ్ లో కొంచెం కష్టమైన పనే. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లకి హీరోయిన్స్ అంటే శ్రేయ, నయనతార మాత్రమే కనిపిస్తున్నారు. అనుష్క హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకు మాత్రమే సరిపోతుంది.


అసలు విషయంలోకి వస్తే వెంకటేష్ హీరోగా తేజ డైరెక్షన్ లో సురేష్ బాబు, అనిల్ సుంకర లు సంయుక్తంగా ఒక సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా లో వెంకటేష్ కి జోడీగా చాలామంది హీరోయిన్లు ను అనుకున్నారు కానీ ఫైనల్ గా శ్రేయ ను తీసుకున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల వంటి సినిమాలు కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ జతకట్టబోతున్నారు.


ఫ్యామిలీ థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ చిత్రానికి 'ఆటా నాదే వేటా నాదే' అనే  టైటిల్ను ఖరారు చేశారు.  ఈ చిత్రంలో వెంకటేష్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నాడు. నారా రోహిత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.

Related News
Aug 01, 2018, 08:32 IST
Jul 23, 2018, 12:14 IST
Jul 20, 2018, 15:56 IST
Jun 26, 2018, 19:21 IST
Jun 26, 2018, 19:22 IST
Jun 23, 2018, 15:39 IST
Related Photos
Sep 25, 2017, 12:14 IST
Aug 18, 2017, 10:57 IST
Aug 15, 2017, 14:13 IST
Related Videos
Feb 25, 2018, 13:59 IST
Aug 31, 2017, 16:14 IST
Aug 18, 2017, 17:31 IST
 
Recommended
Recommended
Latest Albums