language
Home >> News
Dedicated Servers from Liquid Web

బన్నీ.. చెన్నై ప్రయాణానికి ఇంకా టైముందా..?

  Aug 12, 2017, 14:56 IST
| Views : 121

బన్నీ ఏంటి... చెన్నై ప్రయాణం ఏంటి అనుకుంటున్నారా..? ప్రయాణం అంటే చెన్నై టూర్ కి వెళ్లడం కాదండి.. తమిళ్ లో సినిమా చేయడానికి. అల్లు అర్జున్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా తెలుగు–తమిళ సినిమా ఒకటి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఒక టైమ్ లో ఈ సినిమాను క్యాన్సిల్‌ చేశారనే టాక్ కూడా వినిపించింది.

అయితే ఈ రూమర్స్ అన్ని కొట్టిపారేస్తూ ఈ తమిళ్ సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చాడు బన్నీ. నిజానికి ‘దువ్వాడ జగన్నాథమ్‌’ తర్వాత బన్నీ–లింగుస్వామి సినిమా షూట్‌ మొదలవ్వాలి. కానీ అర్జున్ దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్ లో 'నా పేరు సూర్య' చేయడం, అదే సమయానికి అక్కడ లింగు స్వామి విశాల్‌ హీరోగా ‘సండైకోళి–2’ సినిమా కోసం ప్రయత్నాల్లో ఉండటం ఒకేసారి జరిగింది.

అయితే ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక తప్పకుండ లింగుస్వామి-బన్నీలా మూవీ మొదలు పెట్టేస్తారట. ఆల్రెడీ బన్నీ–లింగుస్వామిలు ఎప్పుడో స్క్రిప్ట్‌ను లాక్‌ చేశారని గీతా ఆర్ట్స్‌ సన్నిహిత వర్గాల సమాచారం. అంటే త్వరలోనే మనవాడి చెన్నై ప్రయాణం కన్ఫర్మ్ అయిపోతుందన్న మాట..


Related News
Jul 17, 2018, 21:10 IST
Jul 01, 2018, 14:31 IST
May 12, 2018, 21:59 IST
May 10, 2018, 14:24 IST
May 08, 2018, 17:57 IST
Apr 15, 2018, 18:57 IST
Related Photos
Sep 30, 2017, 13:29 IST
Jul 31, 2017, 19:34 IST
Jul 26, 2017, 15:15 IST
Related Videos
May 15, 2018, 00:38 IST
Feb 14, 2018, 14:47 IST
Jan 26, 2018, 23:39 IST
 
Recommended
Recommended
Latest Albums