language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఉగాది కానుకగా " కారులో షికారుకెళితే "

  Mar 20, 2017, 14:31 IST
| Views : 36

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 31న " కారులో షికారు కెళితే " చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు . ధీరూ మహేష్ ,సుదర్శన్ ,ప్రియాంక , ఇషికా సింగ్ , జీవా తదితరులు నటించిన హర్రర్ థ్రిల్లర్ ని శ్రీ హరిహర ఫిల్మ్స్ పతాకంపై మధు , అనీష్ , అభిరాం లు సంయుక్తంగా నిర్మించారు . రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ '' మీనాక్షి భుజంగ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుంది 

 పాటలు చాలా బాగా వచ్చాయి తప్పకుండా అందరినీ అలరిస్తాయని ఇక చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా మా సినిమాకు మరింత అందాన్ని ఇచ్చిందని ...... మా కారులో షికారుకెళితే తప్పకుండా యూత్ అందరినీ ఆకట్టుకుంటుందని , హర్రర్ తో పాటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందించామని '' సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేసాడు . ఇంతకుముందు గులాబీ వంటి సామజిక ఇతివృత్తం గల చిత్రాన్ని చేసి ప్రశంసలు అందుకున్న మాదాల కోటేశ్వర్ రావు కమర్షియల్ సక్సెస్ కోసం హర్రర్ బాట పట్టాడు .

చిత్ర నిర్మాతలు మధు , అనీష్ , అభిరాం లు మాట్లాడుతూ " మిత్రుడు కోటేశ్వర్ రావు చెప్పిన కథ నచ్చడంతో కేవలం అతడి పై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం . హర్రర్ నేపథ్యంలో రూపొందిన మా కారులో షికారుకెళితే  చిత్రం తప్పకుండా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని , అందుకే ఎన్ని చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ మా సినిమాని ఈనెల 31న రిలీజ్ చేస్తున్నామని అన్నారు . 

Related News
Mar 09, 2017, 13:18 IST
Feb 27, 2017, 14:40 IST
Feb 07, 2017, 12:00 IST
Feb 03, 2017, 10:25 IST
May 19, 2015, 15:52 IST
Nov 18, 2014, 16:37 IST
Related Photos
Mar 14, 2017, 09:33 IST
Mar 10, 2017, 17:30 IST
Jan 10, 2017, 17:42 IST
Related Videos
Apr 03, 2015, 13:07 IST
Mar 12, 2015, 18:21 IST
Mar 12, 2015, 18:17 IST
 
Latest News
Most Viewed
Recommended
Recommended
Latest Albums