language
Home >> News
Dedicated Servers from Liquid Web

స్టూడెంట్స్ తలచుకుంటే సూపర్ స్టార్స్ ని చేయగలరంటున్న రామ్ చరణ్

  Mar 20, 2017, 15:53 IST
| Views : 75

మెగా వారసుడు రామ్ చరణ్ వరస హిట్లతో స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించుకుని రేస్ లో ముందుకుదూసుకెళ్తున్నాడు. నిన్న విజయనగరంలోని తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కాలేజ్ లో జరిగిన యూత్ ఫెస్టివ్ కి చరణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా చెర్రీ తను సినిమాల్లోకి రావడం వల్ల బి.కామ్ మధ్యలోనే మానేయాల్సి వచ్చిందని, విద్యార్థి జీవితం చాలా గొప్పదని ఇప్పటికైనా అవకాశం దొరికితే కొన్నాళ్ళు సినిమాలు పక్కన పెట్టి కాలేజ్ కి వచ్చి చదువుకోవాలని ఉందని తన మనసులో మాటలు బయటపెట్టాడు.

విద్యార్థుల్లో ఉత్సాహం నింపడానికి విద్యార్థులు తలుచుకుంటే ఏదయినా చేయగలరని, ఎవరినైనా సూపర్ స్టార్, మెగా స్టార్స్ ని చేయగలరని వారిని కొనియాడాడు. అవంతి కాలేజ్ అంటే మంచి పేరుందని, ప్రతి విద్యార్థి తన ఎనర్జీని మంచి పనులకు వుపయోగించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించాడు.

Related News
Apr 30, 2017, 11:42 IST
Apr 24, 2017, 16:56 IST
Apr 21, 2017, 18:54 IST
Apr 18, 2017, 15:19 IST
Apr 17, 2017, 12:33 IST
Apr 03, 2017, 15:57 IST
Related Photos
Apr 25, 2017, 11:33 IST
Mar 27, 2017, 16:01 IST
Mar 27, 2017, 10:19 IST
Related Videos
Mar 01, 2017, 10:13 IST
Feb 21, 2017, 20:41 IST
Jan 23, 2017, 16:22 IST
 
Latest News
Most Viewed
Recommended
Recommended
Latest Albums