language
Home >> News
Dedicated Servers from Liquid Web

8 నెలల తరవాత షూటింగ్ కి 'నితిన్'

  Jan 07, 2017, 13:40 IST
| Views : 99

'అ ఆ' సినిమా తరవాత గ్యాప్ తీసుకున్న నితిన్ హను రాఘవపూడి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ వంటి డిఫరెంట్ ప్రేమకథా సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మనముందుకు రాబోతున్నాడు.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పటినుండో అనుకుంటున్నా ఇన్నాళ్లకు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నిన్న మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరగనుంది. ఇక రెండో షెడ్యూల్ షూటింగ్ యు.ఎస్ లో జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సినిమాల విషయంలో ఆచి, తూచి అడుగులేస్తున్న నితిన్ 8 నెలల తరవాత షూటింగ్ లో పాల్గొనున్నాడు. ''ఆ ఆ' హిట్ తరవాత నితిన్ హను రాఘవపూడి వంటి హిట్ దర్శకుడి దర్శకత్వంలో నటించడం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.     

Related News
Apr 19, 2017, 12:03 IST
Apr 03, 2017, 10:47 IST
Mar 30, 2017, 11:21 IST
Feb 08, 2017, 15:39 IST
Nov 16, 2016, 14:29 IST
Jul 11, 2016, 16:48 IST
Related Photos
Mar 30, 2017, 15:11 IST
Mar 30, 2017, 11:16 IST
Mar 28, 2017, 18:32 IST
Related Videos
May 02, 2016, 21:27 IST
May 02, 2016, 18:13 IST
May 02, 2016, 11:08 IST
 
Latest News
Most Viewed
Recommended
Recommended
Latest Albums