language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఎన్.టీ.అర్ కి స్వాగతం సుస్వాగతం...!

By : Vijay |
  Jun 13, 2018, 11:58 IST
| Views : 387

టాలీవుడ్‌కి ఇప్పుడు జూనియర్  ఎన్.టీ.ఆర్  `అతిథి` పాత్ర పోషిస్తున్నాడు. ఏ హీరోల సినిమా ఫంక్ష‌న్లు అయినా జూనియర్  ఎన్.టీ.ఆరే గుర్తొస్తున్నారు. మహేష్ 'భరత్ అనే నేను సినిమా' ఆడియో ఫంక్ష‌న్ కు ఎన్.టీ.ఆర్ నే వెళ్ళాడు, వై జయంతి మూవీస్ ఓనర్ అశ్వినీదత్  పిలిచినా ఎన్.టీ.ఆర్ నే, తమ్ముడు కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' ప్రి రిలీజ్ ఈవెంట్ కి కూడా ఎన్.టీ.ఆరే.

ఐ.పి.ఎల్ ప్రమోషన్స్ కోసం కూడా కావాల్సింది జూనియర్ ఎన్.టీ.ఆరే, కమల్ హాసన్ లాంటి నటుడు 'విశ్వరూపం' ట్రైలర్ తెలుగు లో రిలీజ్ చేయాలన్న ఎన్.టీ.ఆరే. ఈ ఘన స్వాగతలు సినిమాలు వరుకునే అనుకుంటే  పొరపాటు, జూనియర్ ఎన్.టీ.ఆర్ నీ ప్రస్తుతం రాజకీయాల్లోకి టీడీపీ మరోసారి స్వాగతం పలుకుతుంది. 2009 ఎలక్షన్స్ లో జూనియర్ ఎన్.టీ.ఆర్ చేసిన సుడిగాలి పర్యటన ఎవ్వరు మర్చిపోలేరు, అది అతనికి మాత్రమే సాధ్యం. చివరికి ఏక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో ఉన్నా, బెడ్ మీద నుంచే టీడీపీ కి ప్రచారం చేశారు. అయితే ప్రజారాజ్యం పార్టీ దెబ్బ కు ఓట్లు చీలిపోయాయి దానితో టీడీపీ 2009 లో ఓటమి పాలయ్యింది.

అయితే 2014 లో మాత్రం సీన్ మారింది, ఎన్.టీ.ఆర్ స్థానం లో పవన్ కళ్యాణ్ కి ఆ స్వాగతం లభించింది. పవన్ కూడా అంతే వేగంగా ప్రచారం చేశారు, ఫలితం 2014 లో టిడిపి విజయం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ కి దూరం అవ్వడం బాలకృష్ణకు సరిపడినంత బలం లేనందున మళ్లీ జూనియర్ ఎన్.టీ.ఆర్ ను తిరిగి రంగం లోకి దింపాలని అనుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఎన్.టీ.ఆర్ సంగతి తెలీదు కానీ జూనియర్ ఎన్.టీ.ఆర్ అభిమానులు మాత్రం ఎన్.టీ.ఆర్ నీ అస్సలు టీడీపీ రాజకీయాల్లోకి వెళ్ళద్దు అని స్పష్టం గా చేప్పెస్తున్నారు. కారణం ఎంటి అంటే చంద్రబాబు నాయుడు  2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ ను వాడుకుని 2014 లో ఎన్.టీ.ఆర్ నీ వదిలేశారు అని చెప్తున్నారు, మరీ రాబోయే రోజుల్లో ఏంజరుగుతుందో చూడాలి...!

Related News
Aug 15, 2018, 12:52 IST
Aug 09, 2018, 10:33 IST
Aug 04, 2018, 09:31 IST
Aug 01, 2018, 08:44 IST
Aug 01, 2018, 08:46 IST
Aug 01, 2018, 08:35 IST
Related Photos
May 17, 2018, 01:05 IST
Nov 27, 2017, 15:12 IST
Nov 27, 2017, 15:09 IST
Related Videos
Aug 17, 2018, 14:50 IST
Aug 15, 2018, 11:53 IST
Jun 29, 2018, 21:10 IST
 
Recommended
Recommended
Latest Albums