language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఉయ్యాలవాడ పేరు మార్చుకోనుందా. .??

  Jul 17, 2017, 14:15 IST
| Views : 109

ఖైదీనెం 150 తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డేనా కాదా అన్న డైలమాలో చాలామంది ప్రేక్షకులు ఉన్నారు. ఏవేవో టైటిల్స్ వినిపించాయి. అయితే అన్ని అనుమానాలనూ పటాపంచలు చేస్తూ తన సినిమా 'ఉయ్యాలవాడ నరసిం‌హారెడ్డి' అని, మెగాస్టార్ 151 విషయం లో ఇదే పక్కా చేసుకోవచ్చనీ కన్‌ఫార్మ్ చేసేసాడు సురేందర్ రెడ్డి. 

'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'ని తెరకెక్కించడానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. తొలికాలాలనాటి పోరాట యోధుడి చరిత్ర కావడంతో, భారీ బడ్జెట్ తో, పలు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఈ టైటిల్ కేవలం తెలుగు వాళ్ళకే సంబదించింది కావడంతో అన్ని భాషలకు సరిపడా టైటిల్ కోసం ఈ టైటిల్ ను మార్చనున్నారు దర్శక-నిర్మాతలు. 

ఈ సినిమా టైటిల్ కోసం వెతకగా ఆఖరికి అన్ని భాషలకి సంబంధించి ఒకే టైటిల్ పెడితే బాగుంటుందనే ఆలోచన చేశారు. అలా ఈ సినిమాకి 'మహావీర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఇప్పుడు 'ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి' సినిమా పేరు ‘మహావీర' గా మారబోతుందన్న మాట టైటిల్ ఏదైనా కథ మాత్రం అదే...

Related News
Apr 15, 2018, 18:57 IST
Mar 14, 2018, 19:31 IST
Feb 25, 2018, 18:22 IST
Feb 21, 2018, 23:15 IST
Feb 20, 2018, 22:40 IST
Feb 18, 2018, 14:53 IST
Related Photos
Sep 25, 2017, 12:14 IST
Sep 05, 2017, 22:06 IST
Aug 22, 2017, 18:41 IST
Related Videos
Feb 25, 2018, 15:09 IST
 
Recommended
Recommended
Latest Albums