language
Home >> News
Dedicated Servers from Liquid Web

రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా "చి ల సౌ" ప్రారంభం !!

  Oct 11, 2017, 15:41 IST
| Views : 194

తేజ్ వీర్ నాయుడు సమర్పించు, సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజ కార్యక్రమాలు ఈ రోజు (బుధవారం)ప్రారంభం అయ్యింది. సుశాంత్ హీరోగా ప్రముఖ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. 

రుహాని శర్మ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతుంది. పీల గోవింద్ సత్యనారాయణ (అనకాపల్లి ఎం.ఎల్.ఏ) ముహూర్తం క్లాప్ కొట్టారు, అలాగే మలశాలదానమ్మ కెమెరా స్విచ్ ఆన్ చేసారు, తొలి షాట్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించడం జరిగింది.

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... "చాలా ప్యాషన్ తో ఉన్న నిర్మాతలతో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు, ఈయన మెంటల్ మదిలో, వెళ్లిపోమాకే సినిమాలకు పని చేశారు. అలాగే మా సినిమా ఎడిటర్ చోట కె ప్రసాద్ డీజే, ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలకు వర్క్ చేశారు. ఈ సినిమా ద్వారా కొత్త సుశాంత్ ని చూస్తారు అన్నారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ... "కథ బాగా నచ్చి చేస్తున్న సినిమా ఇది, రాహుల్ చాలా అద్భుతంగా ఈ చిత్రం తెరకెక్కిస్తాడాని నమ్మకం ఉంది. చాలా గ్యాప్ తరువాత మంచి లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది అన్నారు..

మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ.. ఈ చిత్రం నా కెరీర్ కు చాలా హెల్ప్ అవుతుంది. రాహుల్ కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను అన్నారు.  

ఈ చిత్రానికి నిర్మాతలు: భరత్ కుమార్ మాలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి, కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ విహారి, ఎడిటర్: చోట కె ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయిల గుండ్ల, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ, చీప్ కో డైరెక్టర్: డి. సాయి కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి.

Related News
Jul 11, 2018, 16:40 IST
Jun 19, 2018, 18:48 IST
Feb 18, 2018, 15:16 IST
Oct 19, 2017, 15:47 IST
Oct 18, 2017, 21:41 IST
Sep 11, 2017, 16:10 IST
Related Photos
Oct 18, 2017, 22:51 IST
Oct 13, 2017, 15:29 IST
Oct 11, 2017, 15:46 IST
Related Videos
Oct 12, 2017, 11:23 IST
Aug 19, 2016, 12:47 IST
Aug 04, 2016, 13:18 IST
 
Recommended
Recommended
Latest Albums