language
Home >> News
Dedicated Servers from Liquid Web

పూరీ ఏమి మార్చేశావయ్యా.....

  Aug 12, 2017, 11:59 IST
| Views : 269

తెలుగు సినిమా దర్శకులలో పూరీ జగన్నాధ్ దర్శకత్వ శైలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఐతే ఎప్పుడు యువ హీరోలమీద తన టాలెంట్ చూపించే పూరీ ఈ సారీ పవర్ ఫుల్ అండ్ సీనియర్ నటుడు నటసింహం బాలకృష్ణ మీద తన టాలెంట్ చూపించి గట్టిగానే 'పైసావసూల్' చేసేలా వున్నాడు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలని బట్టి మన దర్శకులు కథలు తయారు చేస్తుంటారు. కానీ పూరీ కథను బట్టి మన బాలయ్యని మార్చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

'పైసావసూల్' స్టంపర్ వీడియో చూస్తుంటే బాలయ్య పదేళ్లు వెనక్కి వచ్చినంత అందంగా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు. ఇప్పటివరకు పవర్ ఫుల్  డైలాగ్స్ తో అభిమానులకు దగ్గరైన బాలయ్య ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా పరకాయ ప్రవేశం చేసి కొత్తగా కనిపిస్తున్నాడు.

ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే వర్షంలో నల్లని ఓవర్ కోట్ లో గొడుగు తిప్పుతూవున్న బాలయ్యని చూస్తుంటే బాలయ్యకి ఇంకా చాలా వయసుందంటున్నారు అభిమానులు. ఇవన్నీ చూస్తుంటే 'పైసావసూల్' సెప్టెంబర్ 1న విడుదలై గట్టిగానే పైసావసూల్ చేసేలా వుంది.


Related News
Jun 16, 2018, 22:08 IST
Jun 13, 2018, 12:11 IST
Jun 01, 2018, 12:25 IST
May 21, 2018, 23:21 IST
May 15, 2018, 23:15 IST
May 13, 2018, 16:26 IST
Related Photos
Nov 19, 2017, 14:04 IST
Nov 12, 2017, 12:05 IST
Nov 02, 2017, 09:10 IST
Related Videos
May 28, 2018, 12:06 IST
Feb 10, 2018, 05:52 IST
Jan 15, 2018, 22:27 IST
 
Recommended
Recommended
Latest Albums