language
Home >> News
Dedicated Servers from Liquid Web

హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌లో రొమాన్స్ ఉందా ?

  Jan 07, 2017, 11:19 IST
| Views : 31

ఉంద‌నే అనిపిస్తోంది ఈ ఫోటోలు చూస్తుంటే .. హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమా ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుని ఎయు స‌ర్టిఫికెట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ వారు ద‌ర్శ‌కుడు చ‌ద‌ల వాడ శ్రీ‌నివాస‌రావు ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తార‌ట‌. తొలి సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ట్టు లేదు అని ప్ర‌శంసించార‌ట‌..


వివ‌రాల్లోకి వెళితే సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న సినిమాల్లో ముఖ్యంగా చిరంజీవి సినిమా బాల‌య్య సినిమా ఆర్ .నారాయ‌ణ‌మూర్తి హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమాలు మూడూ పోటా పోటీగా ఉన్నాయి.. ఈ మూడు సినిమాలు ఒక‌సారి ప‌రిశీల‌న చేస్తే చిరంజీవి స‌ర‌స‌న యువ‌క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు.. అలాగే బాల‌య్య స‌ర‌స‌న కూడా యువ క‌థానాయిక‌లే న‌టిస్తున్నారు.. 


ఇక హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమాలో ఇద్ద‌రూ ఈడూ జోడూ ఉన్న జంట నారాయ‌ణ‌మూర్తి జ‌య‌సుధ‌.. వారిద్ద‌రి మ‌ధ్య మంచి రొమాన్స్ ను క్రియేట్ చేశాడు ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు అని చెప్పుకుంటున్నారు.. నేడు ఒక సారి వివాహాల‌ను ప‌రిశీలిస్తే .. కేవ‌లం జీతాలు పెళ్ళి చేసుకుంటున్నాయి .. అందుకే న‌డివయసు వర‌కు వారి దాంప‌త్యం నిల‌వ‌డం లేదు.. యుక్త వ‌యసులో రొమాన్స్ పెద్ద‌గా ఉండ‌టం లేదు.. భార్య భ‌ర్త న‌డివ‌య‌సు వ‌చ్చేప్ప‌టికి ఒక‌రంటే ఒక‌రి మీద ప్రేమ ఎక్కువ‌వుతుంది. ఇద్ద‌రి మ‌ద్య‌న అవ‌గాహ‌న పెరుగుతుంది. ఒక‌రి ప‌ట్ల ఒక‌రికి గౌర‌వం పెరుగుతుంది.. న‌డివ‌య‌సు వారి మ‌ధ్య విడ‌దీయ‌రాని అనుబంధం ఉంటుంది.. స‌రిగ్గా అలాంటి అనుబంధాన్నే .. ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు అధ్భుతంగా చూపించాడు అని సెన్సార్ వారు చెపుతున్నారు.. అంతెందుకు ఈ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది గా అంద‌మైన గాఢ‌మైన న‌డివ‌య‌సు జంట ప్రేమాను రాగాలు ..ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు కూడా దాదాపు అదే వ‌య‌సు వారు కావ‌డంతో ఈ ర‌కమైన న‌డివ‌య‌సు రొమాన్స్ ను చ‌క్క‌గా పండించిన‌ట్టు ఉన్నారు.. నారాయ‌ణ‌మూర్తి జ‌య‌సుద‌ల మ‌ధ్య‌న మంచి డ్యూయెట్స్ కూడా ఉన్న‌ట్టు ఉన్నాయి.. తినే ముందు రుచి ఎందుకు సంక్రాంతి వ‌ర‌కు వేచి చూద్దామ్ ఈ న‌డివ‌య‌సు ప్రేమ క‌థ ఎలా ఉంటుందో..

Related News
Jan 20, 2017, 10:34 IST
Jan 17, 2017, 11:38 IST
Jan 12, 2017, 21:02 IST
Jan 10, 2017, 10:36 IST
Jan 09, 2017, 11:40 IST
Jan 02, 2017, 17:02 IST
Related Photos
Jan 17, 2017, 18:42 IST
Jan 10, 2017, 10:58 IST
Jan 10, 2017, 10:36 IST
Related Videos
Jan 23, 2017, 16:22 IST
Jan 23, 2017, 16:10 IST
Jan 21, 2017, 11:51 IST
 
Latest News
Most Viewed
Latest Albums