language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఉగాదికి మొదలుకానున్న నాని మల్టీ స్టారర్ చిత్రం

By : Vijay |
  Mar 12, 2018, 20:44 IST
| Views : 251

వరుస హిట్లతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఏకైక హీరో నాని, అవకాశాలను వెతికి మరీ పట్టుకుంటున్నాడు ఆ ప్రయత్నంలోనే నాని నిర్మాతగా కూడా మారాడు. ఇలా ఒక పక్కన హీరోగా రాణిస్తూనే మరోపక్క సినిమాలని నిర్మాతగా పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఇప్పుడు నాని చేతుల్లోకి మరో అవకాశం వచ్చింది అదే నాగార్జునతో మల్టీస్టారర్ మూవీ.


నాగార్జున, నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఉగాది(మార్చి 18న) నుంచి మొదలు కాబోతుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మూడు పాటల రీరికార్డింగ్ అమెరికాలో జరుగుతుంది.


హీరోయిన్ల ఎంపిక ఇంకా జరగాల్సి ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం నాగార్జున, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'ఆఫీసర్' అనే చిత్రంలో బిజీగా ఉన్నారు మరోపక్క నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాల్లో బిజీగా ఉన్నారు.

Related News
Jun 13, 2018, 12:08 IST
May 29, 2018, 14:28 IST
May 25, 2018, 11:30 IST
May 19, 2018, 15:33 IST
May 15, 2018, 13:26 IST
May 14, 2018, 22:07 IST
Related Photos
Dec 09, 2017, 18:03 IST
Dec 04, 2017, 17:46 IST
Nov 29, 2017, 19:41 IST
Related Videos
May 12, 2018, 12:10 IST
Feb 25, 2018, 13:57 IST
Jan 31, 2018, 23:06 IST
 
Recommended
Recommended
Latest Albums