language
Home >> News
Dedicated Servers from Liquid Web

కిరాక్ కోసం కష్టపడుతున్ననిఖిల్

  Jul 17, 2017, 17:52 IST
| Views : 70

కేశవ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నిఖిల్, ఎట్టకేలకు తన కొత్త సినిమా ప్రకటించాడు. ఈసారి ఓ రీమేక్ ప్రాజెక్టును హ్యాండిల్ చేయబోతున్నాడు. కన్నడలో హిట్ అయిన 'కిరాక్ పార్టీ' సినిమా రీమేక్ లో నిఖిల్ నటించబోతున్నాడు. ఆ వివరాలు అఫీషియల్ గా బయటకొచ్చాయి. ఈ సినిమా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది. ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ సినిమా కోసం నిఖిల్ యుకె వెళ్లి ఇరవై రోజులు వుండి, స్పెషల్ గా జిమ్ ట్రయిన్ అయివచ్చాడు. దీంతో మాంచి కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు నిఖిల్. ఇప్పటికే నిఖిల్ ను బయట చూసిన వారు, ప్రొఫైల్ పిక్స్ చూసిన వారు, వావ్ అంటున్నారట. 

ఎక్కడికిపోతావు చిన్నవాడా బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన కేశవ యావరేజ్ అనిపించుకుంది. ఈసారి చేయబోయే సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఈ కిరాక్ పార్టీ అనువాదంపై గట్టి ద్రుష్టి పెట్టాడు నిఖిల్. ఇంకా ఆ కసరత్తును కొనసాగిస్తూనే వున్నాడు. ఈ సినిమాలో కొత్త లుక్ తో నిఖిల్ కనిపించనున్నాడన్న మాట.

Related News
Aug 08, 2017, 11:20 IST
Jul 16, 2017, 12:00 IST
May 30, 2017, 10:40 IST
May 28, 2017, 18:05 IST
May 22, 2017, 11:04 IST
May 22, 2017, 11:13 IST
Related Photos
Jun 05, 2017, 15:29 IST
Jun 01, 2017, 14:31 IST
May 29, 2017, 15:52 IST
Related Videos
Oct 04, 2017, 16:41 IST
May 12, 2017, 11:05 IST
May 09, 2017, 12:18 IST
 
Recommended
Recommended
Latest Albums