language
Home >> News
Dedicated Servers from Liquid Web

తెలుగు రాష్ట్రాలలో 'చిరు' సందడి

By : Vihari |
  Jan 10, 2017, 14:34 IST
| Views : 788

దాదాపు 10 సంవత్సరాల తరవాత అభిమానుల ముందుకు వస్తున్న 'మెగాస్టార్ చిరంజీవి' కి అభిమానులు పెద్ద ఎత్తునే నీరాజనాలు పడుతున్నారు. భారీ బడ్జెట్ తో 'రామ్ చరణ్' నిర్మించిన 'ఖైదీ నెం 150' సినిమా చిరు నటిస్తున్న 150వ సినిమా. సినిమా మొదలు నుండి చివరివరకు ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపుతున్న ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుండడం మెగాస్టార్ అభిమానులకు పండుగలా వుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ రోజున 'రియాద్' లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ సెలవుదినంగా ప్రకటించడం విశేషం. ఎంతో సంచలనం సృష్టించిన తమిళ సూపర్ స్టార్ 'రజినీకాంత్' కబాలి సినిమా కి ఇదేవిధంగా బెంగళూరు, చెన్నై, సౌదీ అరేబియాలలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.

రిలీజ్ కి ముందే ఇంత సందడి చేస్తున్న 'ఖైదీ నెం 150' రేపు రిలీజ్ అయ్యి ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి. 

Related News
Nov 22, 2017, 12:49 IST
Nov 21, 2017, 16:43 IST
Nov 19, 2017, 11:25 IST
Nov 07, 2017, 18:32 IST
Nov 04, 2017, 17:22 IST
Oct 12, 2017, 15:43 IST
Related Photos
Nov 14, 2017, 09:41 IST
Oct 23, 2017, 09:37 IST
Oct 07, 2017, 16:44 IST
Related Videos
Oct 03, 2017, 16:49 IST
Sep 22, 2017, 13:40 IST
Aug 22, 2017, 12:45 IST
 
Recommended
Recommended
Latest Albums